Begin typing your search above and press return to search.

పుష్ప-2 గ్లోబల్ క్రేజ్ కు అల్లు శిరీష్ ఎలివేషన్స్!

ఇందులో భాగంగానే అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

By:  Tupaki Desk   |   5 Feb 2025 2:02 PM GMT
పుష్ప-2 గ్లోబల్ క్రేజ్ కు అల్లు శిరీష్ ఎలివేషన్స్!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప 2: ది రూల్ మరోసారి ఇంటర్నేషనల్ లెవెల్లో సంచలనం సృష్టిస్తోంది. థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ లోనూ అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో టాప్ ట్రెండింగ్‌లో నిలుస్తూ, వెస్ట్రన్ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఈ సినిమా విడుదలైన దగ్గర నుంచి ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న స్పందన చూస్తే పుష్ప 2 పాపులారిటీ ఏ స్థాయికి వెళ్లిందో అర్థమవుతోంది. ముఖ్యంగా, యూరప్, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ సినిమా ఓటీటీ వేదికగా టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్‌గా మారినట్లు ఇదే ప్రత్యక్ష నిదర్శనం అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అలాగే, టాలీవుడ్ నుంచి వచ్చిన మాస్ యాక్షన్ మూవీ ఇంత స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందడం నిజంగా గ్రేట్ అనే ప్రశంసలు అందుతున్నాయి.

ఇక లేటెస్ట్ గా అల్లు శిరీష్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ, 'పుష్ప 2 వెస్ట్రన్ ఆడియన్స్ నుంచి భారీ స్థాయిలో ప్రేమను పొందుతోంది. వారి కల్చర్‌కు పూర్తిగా భిన్నమైన కథతో వచ్చిన ఈ సినిమాకు ఇంత ఆదరణ దక్కడం చాలా స్పెషల్. ఇది కచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో మన సినిమాకు గౌరవం తీసుకువచ్చే అంశం' అని రాసుకొచ్చారు. దీంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఫిఫా లెవెల్‌లో ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ పుష్ప-2 గురించి మాట్లాడుకోవడం విశేషం.

ఇకపోతే, జనవరి 30 నుంచి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో పుష్ప 2 స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో కూడా విశేష ఆదరణ దక్కుతుండటం గమనార్హం. ప్రస్తుతం పలు దేశాల్లో టాప్ 10 ట్రెండ్స్‌లో నిలుస్తూ, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా, ఫాహద్ ఫాజిల్ విలన్ రోల్‌లో ఆకట్టుకున్నారు. టాలీవుడ్ నుంచి జగపతి బాబు, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమా విజయం వెనుక సుకుమార్ మేకింగ్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ ప్రొడక్షన్ విలువలు కీలక పాత్ర పోషించాయి. ఇప్పటికే ‘ఊ అంటావా మావా’ సాంగ్ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పుష్ప 2 సినిమా కూడా అంతర్జాతీయ స్థాయిలో భారీ ఆదరణ పొందుతూ, తెలుగు సినిమాకు గ్లోబల్ లెవెల్లో మరింత మార్కెట్ పెంచేలా ఉంది.