Begin typing your search above and press return to search.

అల్లు స్నేహా రెడ్డి.. బాధలో నుంచి పుట్టిన సందేశమా?

ఇక ఈసారి ఆమె సోషల్ మీడియాలో ఓ రూల్ పెట్టాలని రియాక్ట్ అయిన విధానం చూస్తుంటే గట్టిగా ఒక విషయంలో ఫీల్ అయినట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   13 Feb 2025 10:32 AM GMT
అల్లు స్నేహా రెడ్డి.. బాధలో నుంచి పుట్టిన సందేశమా?
X

అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో అలాగే అతని ఫ్యామిలీ మెంబర్స్ కు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. బన్నీకి సంబంధించిన పర్సనల్ లైఫ్ విషయాలను ఎక్కువగా షేర్ చేయడంలో అతని సతీమణి స్నేహా రెడ్డి ముందుంటారు. అయాన్, ఆర్హాకు సంబంధించిన ఫొటోలు కూడా ఆమె నిత్యం షేర్ చేస్తూనే ఉంటారు. అయితే ఆమె సోషల్ మీడియాలో కాంట్రవర్సీ అయ్యేలా ఎప్పుడు కూడా రియాక్ట్ కాలేదు.


ఇక ఈసారి ఆమె సోషల్ మీడియాలో ఓ రూల్ పెట్టాలని రియాక్ట్ అయిన విధానం చూస్తుంటే గట్టిగా ఒక విషయంలో ఫీల్ అయినట్లు తెలుస్తోంది. స్నేహా రెడ్డి ఒక సామాన్యమైన కాన్సెప్ట్‌ను అందరికీ గట్టిగా తెలియజేశారు. ‘6 PM రూల్’ పేరుతో ఆమె ఇచ్చిన సందేశం ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా మన జీవితాల్లో ఎంతగా ప్రభావం చూపుతోందో ఆమె మాటలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

పిల్లలు నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడేసేలా ఈ సందేశం ఉంది. స్నేహా రెడ్డి తన సోషల్ మీడియా పేజ్‌లో ఒక స్టోరీ షేర్ చేస్తూ ఇలా వ్యాఖ్యానించారు: “సోషల్ మీడియా ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు షాప్‌లా మూసివేస్తే ఎలా ఉంటుంది. మనం నిజమైన జీవితంలో కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలుసుకుని మాట్లాడేవాళ్లం. బయటకు వెళ్లి ప్రకృతిని ఆస్వాదించేవాళ్లం. పుస్తకాలు చదివి, కళల్ని, సంగీతాన్ని ఆస్వాదించే వాళ్లం” అంటూ ఆమె చెప్పిన ఈ సాధారణమైన మాటలు ఇప్పుడు నెటిజన్లను ఆలోచనలో పడేశాయి.

ఈమధ్య కాలంలో బన్నీ జీవితంలో ఊహించిన పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ విషయంలో అతని ఫ్యామిలీ బాగా అప్సెట్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఊహించని కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. బహుశా అందరూ ఫ్యామిలీతో గడిపితే ఎదుటి వారి మనోభావాలు కూడా అర్థమవుతాయి అని ఆమె చెప్పాలని అనుకుంటుందేమో.. ఏదేమైనా బాధలో నుంచి పుట్టిన సందేశం అయ్యి ఉండవచ్చనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.

మంచి ఆలోచనతో ఉంటే ఎదుటి వారిని బాధపెట్టేలా నెగిటివ్ కామెంట్స్ చేయకపోవచ్చు. ఈ సందేశం వెనుక ఉన్న భావన చాలా గట్టిగా ఉంది. మనం ప్రతీరోజు ఆన్‌లైన్‌లో ఎంత సమయం వెచ్చిస్తున్నామో, నిజజీవితంలో ఎంత కాలం మనకు విలువైన వారితో గడుపుతున్నామో అనే విషయం గురించి ఆలోచించాలి అనెలా ఆమె ఒక సంకేతం ఇచ్చారు. అలాంటి సమయాల్లో స్నేహా చెప్పిన ‘6 PM రూల్’ అనేది కుటుంబ బంధాలను బలపరిచే ఒక చిన్న ప్రయత్నం అని చెప్పవచ్చు. మరి ఆమె ఇచ్చిన సందేశానికి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.