Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ని స్వాగ‌తిస్తున్నాం..త్వ‌ర‌లోనే పెద్ద‌ల్ని కలుస్తాం! అల్లు అర‌వింద్

తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక‌పై తెలంగాణ‌లో కొత్త సీఎం.. కేబినేట్ ఏర్పాటు కానుంది.

By:  Tupaki Desk   |   4 Dec 2023 11:23 AM GMT
కాంగ్రెస్ ని స్వాగ‌తిస్తున్నాం..త్వ‌ర‌లోనే పెద్ద‌ల్ని కలుస్తాం! అల్లు అర‌వింద్
X

తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక‌పై తెలంగాణ‌లో కొత్త సీఎం.. కేబినేట్ ఏర్పాటు కానుంది. రెండు ధపాలుగా టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని చూసిన ప్ర‌జ‌లు ఈసారి కాంగ్రెస్ కి ప‌ట్టం కట్టారు. దీంతో ఇండ‌స్ట్రీ త‌రుపున కాంగ్రెస్ పార్టీకి అభినంద‌న‌ల వెల్లువ‌ కురుస్తోంది. ఇప్ప‌టికే చాలా మంది సినీ ప్ర‌ముఖులు విషెస్ తెలియజేస్తూ పోస్టులు పెట్టిన సంగ‌తి తెలిసిందే. గ‌త ప్ర‌భుత్వం ప‌రిశ్ర‌మ తో ఎంతో చ‌నువుగా మెలిగింది

సినీ ప‌రిశ్ర‌మ‌ని వృద్ది లోకి తీసుకొస్తామ‌ని..ఇండ‌స్ట్రీని హైద‌రాబాద్ హ‌బ్ గా మార్చేస్తామ‌ని ప్రామిస్ చేసారు. మ‌రి అది ఎంత‌వ‌ర‌కూ సాధ్య‌మైంది? అన్న‌ది తెలిసిందే. తాజాగా ప‌రిశ్ర‌మ త‌రుపున అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ కాంగ్రెస్ కి విషెస్ తెలియ‌జేస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. ఓ సినిమా ఈవెంట్లో అర‌వింద్ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం విశేషం. తెలంగాణ‌లో కాంగ్రెస్ రావ‌డం సంతోషంగా ఉంది. సినీ ప‌రిశ్ర‌మ‌ని ఆదుకో వ‌డం కాంగ్రెస్ కి కొత్తేం కాదు. ఇంత‌కు ముందున్న ప్ర‌భుత్వాలు ఇండ‌స్ట్రీకి ఎన్నో ప్రోత్సాహ‌కాలు అందించాయి. త్వ‌ర‌లోనే సిని ప‌రిశ్ర‌మ తరుపున పార్టీ ప్ర‌భుత్వ‌ పెద్దల్ని క‌లుస్తాం` అని అన్నారు

అధికారంలోకి ఏ ప్ర‌భుత్వం వ‌చ్చిన ఇండ‌స్ట్రీ త‌రుపున పెద్ద‌లు నేరుగా వెళ్లి క‌లిసి విషెస్ తెలియ‌జేసే సంప్ర‌దాయం టాలీవుడ్ లో ఎప్ప‌టి నుంచో ఉంది. గ‌త ప్ర‌భుత్వం టీఆర్ఎస్ రెండు సార్లు అధికార‌కంలోకి వ‌చ్చిన‌ప్పుడు ఇండ‌స్ట్రీ త‌రుపున విషెస్ తెలియ‌జేయ‌డం జ‌రిగింది. ఈసంద‌ర్భంగా ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌లు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వాటిలో అన్నింటిని కాక‌పోయినా కొన్నింటిని ప్ర‌భుత్వం ప‌రిష్క‌రించింది.

టీఆర్ ఎస్ అధికారంలో ఉన్నంత కాలం ఇండ‌స్ట్రీకి త‌మ స‌హ‌కారం ఎప్పుడూ ఉంటుంద‌ని ప్ర‌క‌టిం చింది. ప‌రిశ్ర‌మ‌కు కావాల్సిన విధంగా అన్నిర‌కాల అనుమ‌తులు సుల‌భంగానే దొరికేవి. ఆ ర‌కంగా ప్ర‌భుత్వంతో ఏనాడు ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డ‌లేదు. తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన నేప‌థ్యంలో పెద్ద‌ల దృష్టికి ఇండ‌స్ట్రీ త‌రుపున ఎలాంటి స‌మ‌స్య‌లు తీసుకెళ్తారు? ఈ ప్ర‌భుత్వం.. ఇండస్ట్రీతో ఎలాంటి స‌త్స‌సంబంధాలు న‌డుపుతుంది అన్న‌ది చూడాలి.