యానిమల్ పై అల్లు అర్జున్ రివ్యూ.. మైండ్ బ్లోయింగ్
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన అనిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది
By: Tupaki Desk | 8 Dec 2023 9:47 AM GMTసందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన అనిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే సినిమా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాపై ఎందుకనో మరి స్టార్ హీరోలు స్టార్ దర్శకులు పెద్దగా రియాక్ట్ అయితే కావడం లేదు. అయితే మరికొందరు మాత్రం చాలా తెలివిగా ఇందులోనే సందీప్ రెడ్డి వర్క్ మెచ్చుకుంటున్నారు.
ఇక అల్లు అర్జున్ అయితే సినిమా చూసిన తర్వాత పూర్తిస్థాయిలో తనకు నచ్చిన పాత్రలపై కూడా ప్రత్యేకంగా రివ్యూ ఇవ్వడం విశేషం. యానిమల్ సినిమా జస్ట్ మైండ్ బ్లోయింగ్ అంటూ ముందుగా రణబీర్ క్యారెక్టర్ గురించి వివరణ ఇచ్చాడు. రణబీర్ కపూర్ జి ఇప్పుడు ఇండియన్ సినిమాని మీరు మరో లెవల్ కు తీసుకువెళ్లారు. ఇది చాలా స్ఫూర్తిదాయకం.
మీరు క్రియేట్ చేసిన మ్యాజిక్ గురించి వివరించడానికి మాటలు కూడా సరిపోవడం లేదు. మీ యాక్టింగ్ కు ఫిదా అయ్యాను అనేలా బన్నీ తెలియజేసాడు. ఇక హీరోయిన్ రష్మిక నటన ఇందులో బ్రిలియంట్ అంటూ ఇందులో మీరు బెస్ట్ వర్క్ ఇచ్చారు.. ఊహించలేదు అన్నట్లుగా కూడా అల్లు అర్జున్ తెలిపాడు. ఇక సన్నీ డియోల్ జి అద్భుతమైన నటన చూసిన తర్వాత నాలో మాటలు రాలేదు మీపై ఇంకా గౌరవం పెరిగింది అని అన్నాడు.
అనిల్ కపూర్ యాక్టింగ్ కూడా ఇందులో చాలా ఇంటెన్స్ గా ఉంది అంటూ ఆయన అనుభవం ఏమిటో ఈ సినిమాలోని పాత్ర ద్వారా రుజువు అవుతుంది అని చెప్పాడు. ఇక త్రిప్తి డిమ్రీ కూడా హృదయాలను బ్లాక్ చేసింది అని మీరు రాబోయే రోజుల్లో మరింత బాగా ఎట్రాక్ట్ చేస్తారు అని మిగతా ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరు కూడా ఈ సినిమాకు బెస్ట్ వర్క్ ఇచ్చారు అన్నట్లుగా కూడా అల్లు అర్జున్ వివరణ ఇచ్చాడు.
ఇక ప్రత్యేకంగా బన్నీ దర్శకుడి గురించి మాట్లాడుతూ.. సందీప్ రెడ్డి వంగా గారు జస్ట్ మైండ్ బ్లోయింగ్.. మీరు సినిమా పరిమితులను అధిగమించారు. మీ సాటి లేని ఔట్ ఫుట్ తో మరోసారి సినీ ప్రపంచంలో అందరినీ గర్వపడేలా చేశారు. మీ సినిమాలు ఇప్పటికే కాకుండా భవిష్యత్తులో కూడా ఒక ట్రెండ్ సెట్ చేస్తాయి అని నేను ఊహించగలను అని అల్లు అర్జున్ తెలియజేస్తూ యానిమల్ సినిమా ఇండియా సినిమాలలో ఒక క్లాసిక్ లో చేరింది అని అన్నాడు.