Begin typing your search above and press return to search.

అట్లీ స‌ల‌హాతోనే బ‌న్నీస్పెష‌ల్ ట్రైనింగా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ ప్రాజెక్ట్ కి స‌న్నాహాలు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   5 March 2025 5:25 AM
అట్లీ స‌ల‌హాతోనే బ‌న్నీస్పెష‌ల్ ట్రైనింగా?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ ప్రాజెక్ట్ కి స‌న్నాహాలు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుంద‌న్న‌ది నెలాఖ‌రుక‌ల్లా క్లారిటీ వ‌స్తుంది. అయితే అట్లీ మాత్రం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీ అయిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే బ‌న్నీకి జోడీగా జాన్వీక‌పూర్ ని హీరోయిన్ గా తీసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే స్టోరీ డిమాండ్ మేర‌కు మ‌రికొంత మంది భామ‌ల్ని కూడా ఎంపిక చేస్తున్నాడు.

దీనిలో భాగంగా ఏకంగా విదేశాల‌కే వెళ్లిపోతున్న‌ట్లు తెలుస్తోంది. సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఉంటారు. ఒక భామ‌గా జాన్వీ క‌పూర్ కాగా, మిగ‌తా న‌లుగురు భామ‌లు విదేశీ బ్యూటీలే అంటున్నారు. అమెరిక‌న్, కొరియ‌న్ భామ‌ల్ని ఎంపిక చేస్తున్నారుట‌. ఈ ప్రాజెక్ట్ ని పాన్ వ‌ర‌ల్డ్ క‌నెక్ట్ చేసే యోచ‌న‌లో భాగంగా విదేశీ బ్యూటీల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు స‌మాచారం.

ఇటీవ‌లే బ‌న్నీ విదేశాల్లో ట్రైనింగ్ కూడా ముగించుకుని హైద‌రాబాద్ కి తిరిగి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ట్రైనింగ్ అట్లీ సినిమాకా? త్రివిక్ర‌మ్ సినిమాకా? అన్న సందిగ్ద‌త కూడా వీడుతుంది. అట్లీ సినిమా కోస‌మే బ‌న్నీ విదేశాల‌కు వెళ్లిన‌ట్లు..అట్లీనే ఓ స్పెష‌ల్ ట్రైన‌ర్ల వ‌ద్ద‌కు పంపించిన‌ట్లు లీకులందు తున్నాయి. బ‌న్నీ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఇంకాస్త డోస్ ఎక్కువ‌గానే అట్లీ హై ఆక్టేన్ స్క్రిప్ట్ రాసాడుట‌.

బ‌న్నీ జిమ్నాస్టిక్, మార్ష‌ల్ ఆర్స్ట్ తెలిసిన న‌టుడు. ఈ నేప‌థ్యంలో బ‌న్నీ లో ఆ యాంగిల్ ని కూడా స్క్రిప్ట్ లో ఇన్ బిల్ట్ చేసాడుట‌. దానికి సంబంధించే విదేశాల్లో ఓ స్పెష‌ల్ ట్రైన‌ర్ వ‌ద్ద 30 రోజులు ట్రైనింగ్ ఇప్పించిన‌ట్లు తెలుస్తుంది. మ‌రి ఇందులో వాస్త‌వం ఏంటో తెలియాలి.