బన్నీని ఏడిపించిన సుకుమార్
ఇక ఈ ఈవెంట్ లో డైరెక్టర్ సుకుమార్ అందరిని కాస్తా ఎమోషనల్ కి గురి చేశారు.
By: Tupaki Desk | 3 Dec 2024 5:47 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో ప్రతి ఒక్కరు సినిమా షూటింగ్ సమయంలో వాతావరణం గురించి.. అలాగే ఈ మూడేళ్ళ కాలంలో వారి అనుబంధం గురించి గొప్పగా చెప్పుకున్నారు. ఇక ఈ ఈవెంట్ లో డైరెక్టర్ సుకుమార్ అందరిని కాస్తా ఎమోషనల్ కి గురి చేశారు. ముఖ్యంగా సుకుమార్ మాటలకి అల్లు అర్జున్ చాలా ఎమోషనల్ అయిపోయి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘పుష్ప 1, 2’ సినిమాలని కేవలం అల్లు అర్జున్ మీద ప్రేమతోనే చేసాను. నిజానికి ఫస్ట్ టైం అతన్ని కలిసినపుడు నా దగ్గర కథ లేదు. కేవలం ఒకటి, రెండు సీన్స్ మాత్రమే బన్నీకి చెప్పాను. పుష్ప క్యారెక్టర్ ఎలా ఉంటుందనేది సింపుల్ గా నేరేట్ చేసాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఏం చెప్పిన దానిపై పూర్తిగా నమ్మకం ఉంచాడు. నాకు ప్రతి రోజు ఎనర్జీ ఇస్తూ ఉండేవాడు. ప్రతి సీన్ ని ఎంజాయ్ చేశాడు.
షూటింగ్ లో అందరూ ఒక సీన్, ఒక ఫైట్ కోసం తపన పడతారు. బన్నీ ఈ సినిమాలో ఓ చిన్న ఎక్స్ ప్రెషన్ కూడా బెస్ట్ గా ఇవ్వాలని ఫైట్ చేసేవాడు. అలాంటి తపన ఉంటే డైరెక్టర్ కి చాలా బూస్టింగ్ ఇస్తుంది. సినిమానే మాకు ప్రపంచం. అలాంటి సినిమాని ఒక స్థాయికి తీసుకొని వెళ్ళడానికి నటుడు తపన పడుతున్నాడు అంటే కచ్చితంగా ఎనర్జీ వస్తుంది.
బన్నీ అందరిని ఒక హైకి తీసుకొని వెళ్లి కూర్చోబెడతాడు. అందరూ అక్కడే ఉండి వర్క్ చేయాల్సి ఉంటుంది. అతని ఎనర్జీ, బూస్టింగ్ కారణంగానే ‘పుష్ప’ రెండు పార్ట్స్ ఈ స్థాయిలో వచ్చాయని సుకుమార్ చెప్పుకొచ్చారు. సుకుమార్ చెప్పిన ఈ మాటలకి అల్లు అర్జున్ చాలా ఎమోషనల్ అయిపోయాడు. సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
అతని పక్కనే ఉన్న శ్రీలీల అల్లు అర్జున్ ని చూస్తూ తను కూడా కాస్తా ఎమోషనల్ అయిపొయింది. ఈ వీడియో బైట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అలాగే ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ స్టేజ్ పైన మాట్లాడుతూ సుకుమార్ లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ లేను. నా ఎదుగుదలలో అతను చాలా కీలకం అని ఎమోషనల్ గా సుకుమార్ తో ఉన్న బాండింగ్ ని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.