Begin typing your search above and press return to search.

పుష్ప రాజ్ దృష్టిలో పడ్డదంటే..?

ఆయ్ సినిమాతో సక్సెస్ అందుకున్న హీరోయిన్ నయన్ సారిక అంతకుముందు ఆనంద్ దేవరకొండతో గం గం గణేశా సినిమాలో నటించింది.

By:  Tupaki Desk   |   31 Aug 2024 2:30 PM GMT
పుష్ప రాజ్ దృష్టిలో పడ్డదంటే..?
X

ఆయ్ సినిమాతో సక్సెస్ అందుకున్న హీరోయిన్ నయన్ సారిక అంతకుముందు ఆనంద్ దేవరకొండతో గం గం గణేశా సినిమాలో నటించింది. ఆ సినిమాలో అంతగా గుర్తింపు రాలేదు కానీ ఆయ్ సినిమాతో మాత్రం అమ్మడు ఆడియన్స్ మనసులు దోచేసింది. నార్నే నితిన్ హీరోగా తెరకెక్కిన ఆయ్ సినిమాను అంజి డైరెక్ట్ చేయగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా తెరకెక్కింది. ఆగస్టు 15న రిలీజైన సినిమాల్లో సూపర్ హిట్ అందుకుంది ఆయ్. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన నయన్ సారిక గురించి అందరు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు.

సినిమాలో ఆమె యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్ అన్ని ఇంప్రెస్ చేశాయి. కేవలం ఆడియన్స్ ని మాత్రమే కాదు ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని కూడా అమ్మడు మెప్పించింది. సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్ చిత్ర యూనిట్ ని అభినందించగా నయన్ ని ప్రత్యేకంగా మెచ్చుకున్నారట అల్లు అర్జున్. ఆమె ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్, యాక్టింగ్ చూసి ఆమె సౌత్ అమ్మాయి అనుకున్నారట. కానీ తను నార్త్ నుంచి వచ్చానని చెప్పి సర్ ప్రైజ్ చేసిందట.

ఆయ్ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఎన్టీఆర్ కూడా చిత్ర యూనిట్ ని అభినందించారు. ఐతే ఈ సినిమాతో తనకు వచ్చిన ప్రశంసలు ఎప్పటికీ మర్చిపోలేనని అంటుంది నయన్ సారిక. ఈ సినిమా సక్సెస్ టీం అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చిందని.. మంచి విజయంతో టాలీవుడ్ ప్రయాణం మొదలు కావడం ఆనందంగా ఉందని అన్నది నయన్ సారిక.

అసలే తెలుగులో కథానాయికలు చాలా తక్కువ. ప్రతివారం రిలీజ్ అవుతున్న సినిమాలతో ఎంతోమంది హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తున్నా ఎవరు స్టార్ రేంజ్ దక్కించుకుంటారన్నది చెప్పడం కష్టం. ఐతే నయన్ సారిక చేసిన పెర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం అమ్మడికి సరైన పాత్రలు పడితే కచ్చితంగా స్టార్ క్రేజ్ తెచ్చుకునేలా ఉందని చెప్పొచ్చు. ఆయ్ తర్వాత అమ్మడు కిరణ్ అబ్బవరం చేస్తున్న క సినిమాలో ఛాన్స్ అందుకుంది. హిట్టు కొట్టాక ఎలాగు వరుస ఛాన్సులు రావడం కామన్. కానీ వాటిలో మంచి కథలను ఏరికోరి ఎంపిక చేసుకుంటేనే సక్సెస్ అందుకునే ఛాన్స్ ఉంటుంది. నయన్ సారికకు మరో రెండు హిట్లు పడితే మాత్రం అమ్మడు కూడా స్టార్ రేసులో ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.