Begin typing your search above and press return to search.

రేవతి ఘటనపై అల్లు అర్జున్ వివరణ.. కుటుంబానికి అండగా ఆర్థిక సాయం

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తాజాగా ఈ ఘటనపై వీడియో రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ..

By:  Tupaki Desk   |   7 Dec 2024 4:04 AM GMT
రేవతి ఘటనపై అల్లు అర్జున్ వివరణ.. కుటుంబానికి అండగా ఆర్థిక సాయం
X

హైదరాబాద్ లోని సంధ్య థియేటర్స్ లో వేసిన ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ వెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. పోలీసులు కూడా ఈ ఘటనపై కాస్తా సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత నిర్మాతలు కొన్ని గంటల వ్యవధిలోనే రియాక్ట్ అయ్యారు.

ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తాజాగా ఈ ఘటనపై వీడియో రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. గత 20 ఏళ్ళుగా మొదటి షోని థియేటర్స్ లో అభిమానులతో కలిసి చూడటం నాకు ఆనవాయితీగా వస్తోంది. అలాగే ఈ సారి కూడా ‘పుష్ప 2’ వీక్షించడం కోసం సంధ్య థియేటర్ కి వెళ్లాను. ఆ సందర్భంగా అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో తొక్కిసలాట జరిగిందనే విషయం తరువాత నాకు తెలిసిందే.

ఆ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిందనే విషయం మరుసటి రోజు నా దృష్టికి వచ్చింది. ఆమె మృతి నన్ను బాధించింది. మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని అనుకున్నాం. అయితే ఆమె మృతి ఘటన నేపథ్యంలో సక్సెస్ సెలబ్రేషన్స్ చేయాలనిపించలేదు. ఆడియన్స్ ని సంతోషపెట్టాలని సినిమాలు చేస్తూ ఉంటాం. కానీ ఇలాంటి ఘటనలు జరిగినపుడు బాధకలుగుతుంది. ప్రేక్షకులు అందరూ క్షేమంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటాం.

ఇక ఆమె లేని లోటుని తిరిగి భర్తీ చేయలేము. అయితే వారి కుటుంబానికి నేను అండగా ఉంటాను. వారి భవిష్యత్తు కోసం 25 లక్షలు ఆర్ధిక సహాయం చేస్తున్నాము. దీనితో సంబంధం లేకుండా పిల్లాడి మెడికల్ ఖర్చులు అన్ని భరిస్తాను. ఆ ఫ్యామిలీ బాధ్యత నాది. చనిపోయిన రేవతి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాము. అన్ని విధాలుగా వారికి అండగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నాము.

మీ ఆనందం కోసం మేము సినిమాలు చేస్తాము. ప్రశాంతంగా థియేటర్స్ కి వెళ్లి ఎంజాయ్ చేయండి. అలాగే కాస్తా మీ సేఫ్టీ కూడా చూసుకోండి. మీకు ఏమైనా జరిగితే మానసికంగా మేము తట్టుకోవడం కష్టం అవుతుంది అని అల్లు అర్జున్ వీడియోలో తెలియజేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.