Begin typing your search above and press return to search.

నంద్యాల పర్యటన కేసు.. హైకోర్టుకు అల్లు అర్జున్

దీంతో దానిని ఎండ్ చేయాలని కొందరు కామన్ ఫ్యాన్స్ ఇప్పటికీ కోరుతున్నారు.

By:  Tupaki Desk   |   21 Oct 2024 7:43 AM GMT
నంద్యాల పర్యటన కేసు.. హైకోర్టుకు అల్లు అర్జున్
X

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన ఎంతటి వివాదం రేపిందో అందరికీ తెలిసిందే. ఏపీ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ బన్నీ విష్ చేయడంతో మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత వారికి, అల్లు ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో మొదలైన మాటల యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీంతో దానిని ఎండ్ చేయాలని కొందరు కామన్ ఫ్యాన్స్ ఇప్పటికీ కోరుతున్నారు.

అయితే అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు రిటర్నింగ్‌ అధికారి నుంచి ముందస్తు అనుమతులు తీసుకోలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. అనుమతులు లేకున్నా.. భారీ వాహనాలు, బైక్స్ తో ప్రదర్శనగా నంద్యాలలోకి బన్నీని తీసుకొచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో కొందరు ఆ విషయాన్ని ఎన్నికల అధికారుల దృష్టికి వెళ్లారు. దీంతో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని అల్లు అర్జున్‌, శిల్పా రవిపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆ విషయాన్ని ఎన్నికల అధికారి జేసీ రాహుల్‌ కుమార్‌ రెడ్డి అప్పట్లో మీడియా ద్వారా తెలిపారు. ఇప్పుడు అల్లు అర్జున్.. తాజాగా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసు విషయంలో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే అల్లు అర్జున్ పిటిషన్‌ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. సోమవారమే విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 బిజీగా ఉన్న విషయం తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్.. సినీ ప్రియులతోపాటు ఫ్యాన్స్ లో వేరే లెవెల్ అంచనాలు నెలకొల్పింది. కచ్చితంగా హిట్ అవుతుందనేలా నమ్మకాన్ని క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ గా భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందని, కొత్త రికార్డులు సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇక పుష్ప ప్రమోషన్స్ లో భాగంగా నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ ఫోర్త్ సీజన్ కు బన్నీ త్వరలో రానున్నట్లు తెలుస్తోంది. మూవీ టీమ్ తో ఆయన సందడి చేయనున్నట్లు సమాచారం. ఆ సమయంలో నంద్యాల పర్యటనపై స్పందిస్తారని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆయన ఆ పర్యటన నేపథ్యంలో నమోదైన కేసును కొట్టి వేయాలని కోర్టును కోరారు. మరి న్యాయస్థానం తీర్పు ఏంటో వేచి చూడాలి.