Begin typing your search above and press return to search.

బాలయ్య × బన్నీ అన్‌స్టాపబుల్ ఫైర్.. గేట్ రెడీ

రెండు భాగాలుగా రానున్న ఈ ప్రత్యేక ఎపిసోడ్‌లలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలపై చర్చించబోతున్నారు.

By:  Tupaki Desk   |   14 Nov 2024 6:15 PM GMT
బాలయ్య × బన్నీ అన్‌స్టాపబుల్ ఫైర్.. గేట్ రెడీ
X

అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 4లో పుష్ప స్టార్ అల్లు అర్జున్ పాల్గొననున్న విషయం తెలిసిందే. ఇదివరకే ఒక సీజన్ లో ఈ కాంబినేషన్లో వచ్చిన ఎపిసోడ్ డిజిటల్ వరల్డ్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ప్రత్యేక ఎపిసోడ్ నవంబర్ 15 అర్ధరాత్రి 12 గంటల నుంచి అహా ఓటిటి ప్లాట్‌ఫాం లో స్ట్రీమింగ్ కానుంది. రెండు భాగాలుగా రానున్న ఈ ప్రత్యేక ఎపిసోడ్‌లలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలపై చర్చించబోతున్నారు.


మొదటి భాగంలో అల్లు అర్జున్ అతని జీవితంలోని రహస్యాలు, కెరీర్ లో ప్రయాణం, వ్యక్తిగత అనుభవాలు పంచుకున్నాడు. ఈ ఎపిసోడ్‌లో, తన చిన్ననాటి జ్ఞాపకాల నుంచి ఇండస్ట్రీలో దిగ్గజ నటుడిగా ఎదిగినంత వరకు అనేక అంశాలపై అర్జున్ తన అనుభవాలను షేర్ చేసుకున్నాడు. అలాగే అల్లరిగా చేసే ప్రాంకులు, వివాహం తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి ఆయన వ్యక్తిగత కథలు పంచుకున్నాడు.

స్నేహారెడ్డి‌తో వివాహం తర్వాత తన జీవితానికి వచ్చిన కొత్త ఆలోచనలు, వృత్తి పరంగా పెరిగిన క్రమశిక్షణ గురించి చెప్పాడు. ఈ ఎపిసోడ్‌లో ప్రత్యేకంగా నిలిచే ఘట్టం.. జాతీయ అవార్డు గెలిచే కల గురించి వివరించడం. చాలా కాలంగా తనకు ఎంతో ప్రాధాన్యత కలిగిన అంశం అని, ఇంతకాలం దక్కని తెలుగు నటులకు ఆ గౌరవం తీసుకురావాలని బన్నీ కలగన్నట్లు చెప్పాడు. ఈ లక్ష్యంతో పనిచేసి, 2023లో పుష్ప: ది రైజ్ చిత్రంలో అత్యుత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలవడం ద్వారా చరిత్ర సృష్టించాడు.

అంతేకాకుండా బాలీవుడ్, టాలీవుడ్ లోని పలు స్టార్‌లపై ఉన్న అభిమానాన్ని కూడా పంచుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబెల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలీవుడ్ లో రణబీర్ కపూర్, రజినీకాంత్ వంటి నటులపై తనకున్న గౌరవాన్ని తెలియజేశాడు. ఆ ఎపిసోడ్ లో ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ లో అల్లు అర్జున్ తల్లి నిర్మల అల్లు ప్రత్యేకంగా హాజరవడం, ఆ క్షణం ఆయన అభిమానులకు ఎమోషనల్ గా నిలిచింది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ జీవితంలోని ఎన్నో అంశాలను ఈ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ద్వారా అభిమానులకి తెలియజేయబోతున్నారు. వ్యక్తిగత కథలు, ఆసక్తికర సర్‌ప్రైజ్‌లతో ఈ ఎపిసోడ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందట. నవంబర్ 15 అర్ధరాత్రి 12 గంటల నుంచి అహా లో స్ట్రీమింగ్ కానున్న ఈ ఎపిసోడ్‌ని రికార్డ్ క్రియేట్ చేసేలా ఉందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.