Begin typing your search above and press return to search.

అన్ స్టాపబుల్ కు బన్నీ.. ఆ గోడవపైనే అందరి ఫోకస్

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ NBK షోకు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 Oct 2024 8:28 AM GMT
అన్ స్టాపబుల్ కు బన్నీ.. ఆ గోడవపైనే అందరి ఫోకస్
X

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ NBK షోకు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఆహా ఓటీటీలో ఇప్పటికే స్ట్రీమ్ అయిన మూడు సీజన్లు సక్సెస్ అయ్యాయి. అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు.. ఆయా ఎపిసోడ్లకు వచ్చి అలరించారు. బాలయ్య తన క్వశ్చన్స్ అండ్ గేమ్స్ తో ఫుల్ ఎంటర్టైన్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు నాలుగో సీజన్ తో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అన్ స్టాపబుల్ నాలుగో సీజన్.. ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో అలరిస్తుందని ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య తెలిపారు. ఈ సారి మరిన్ని ఫన్నీ గేమ్స్ ఉంటాయని అన్నారు. ప్రశ్నలు ఘాటుగా ఉంటాయని చెప్పారు. దీంతో నాలుగో సీజన్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ఆహా వేదికగా అక్టోబర్ 24వ తేదీన సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమ్ కానుందని సోషల్ మీడియాలో నిర్వాహకులు అనౌన్స్ చేశారు.

అయితే ఫస్ట్ ఎపిసోడ్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా రానున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు పుష్ప -2 టీమ్ పార్టిసిపేట్ చేయనున్నట్లు సమాచారం. త్వరలో పుష్ప సీక్వెల్ రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో పుష్ప టీమ్.. వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అతి త్వరలో ఆ ఎపిసోడ్ షూటింగ్ జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత ప్రోమో రిలీజ్ అవ్వనుంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీంతో వెయిటింగ్ ఫర్ ఫస్ట్ ఎపిసోడ్ అంటూ అటు బాలయ్య ఫ్యాన్స్.. ఇటు అల్లు అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అయితే షోలో భాగంగా బాలయ్య.. నంద్యాల ఎపిసోడ్ ను ప్రస్తావించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ట్వీట్ చేసి.. శిల్పా రవి ఇంటికి వెళ్లి మరీ విష్ చేయడాన్ని మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.

ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు మెగా, అల్లు కుటుంబాల ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. దీంతో ఇప్పుడు నంద్యాల విషయంపై బన్నీ ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే పలువురు కామన్ ఫ్యాన్స్.. నంద్యాల వివాదాన్ని క్లోజ్ చేయాల్సిందిగా ఎప్పటి నుంచో అల్లు అర్జున్ ను కోరుతున్నారు. ఇప్పుడు అన్ స్టాపబుల్.. అందుకు పర్ఫెక్ట్ వేదిక అని చెబుతున్నారు. తన వివరణతో ఇక్కడితో వివాదాన్ని ముగించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.