Begin typing your search above and press return to search.

మెగాస్టార్ తో ఉన్న అనుబంధం అలాంటిది - అల్లు అర్జున్

ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని అల్లు అర్జున్ గుర్తుచేసుకున్నారు.

By:  Tupaki Desk   |   22 Nov 2024 6:42 AM GMT
మెగాస్టార్ తో ఉన్న అనుబంధం అలాంటిది - అల్లు అర్జున్
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా బాలయ్య ‘అన్ స్టాపబుల్ సీజన్ 4’కి గెస్ట్ గా వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ కి సంబందించిన ఎపిసోడ్ పార్ట్ 1 లాస్ట్ వీక్ రిలీజ్ అయ్యింది. తాజాగా ఈ ఎపిసోడ్ పార్ట్ 2 కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో బన్నీ చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని అల్లు అర్జున్ గుర్తుచేసుకున్నారు.

తాను చిరంజీవి గారిని చిక్కు బాబాయ్ అని పిలుస్తాననే విషయాన్ని అల్లు అర్జున్ ఈ ఎపిసోడ్ లో రివీల్ చేశారు. చిరంజీవి గారితో చిన్నప్పటి నుంచి నాకు మంచి అనుబంధం ఉందని తెలిపాడు. ఈ 20 ఏళ్లలో చిరంజీవి గారు అంటే నాకు ఇష్టమని ఇప్పుడు అందరికి తెలుసు. అయితే దానికి ముందు 20 ఏళ్ళు ఏంటో ఎవరికి తెలియదు. అయితే నేను చిన్నప్పటి నుంచి ఆయనకి అభిమానిని. ఫస్ట్ చిరంజీవి అనే ఒక వ్యక్తికి ఇష్టపడిన తర్వాత మెగాస్టార్ కి ఫ్యాన్ గా మారాను. ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వాన్ని నేను బాగా ఇష్టపడతాను.

చిన్న వయస్సులోనే నన్ను, తమ్ముడితో పాటు పిల్లల అందరిని కూడా ఫస్ట్ టైం ఫారిన్ తీసుకొని వెళ్ళింది చిరంజీవి గారే. కావాలనుకుంటే ఆయన, ఆయన ఫ్యామిలీ వెళ్ళుండొచ్చు. కానీ నన్ను, శిరీష్ అలాగే మా కజిన్ తోపాటు అందరూ కలిపి 10 మంది పిల్లలని ఫారిన్ తీసుకొని వెళ్లారు. ఆ రోజుల్లో ఇంత మంది పిల్లలని ఫారిన్ తీసుకొని వెళ్లడం అనేది అసాధ్యం. కానీ అలాంటిది మమ్మల్ని తీసుకొని వెళ్లి హాలిడేస్ ఎంజాయ్ చేయించి తీసుకొచ్చారు.

నాకు ఊహ వచ్చి అంత పెద్ద స్టార్ అని తెలియడానికి ముందే నేను చిరంజీవి గారిని చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నాను. ఆ అభిమానంతోనే ఆయన్ను చిక్కు బాబాయ్ అని నేను పిలుస్తాను అని కూడా అల్లు అర్జున్ ‘అన్ స్టాపబుల్ షో’ లో బాలయ్యతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అలాగే ఈ షోలో అల్లు అర్జున్ కూతురు అర్హ తెలుగు పద్యం పాడి అందరికి షాక్ ఇచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అన్ స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ మెగాస్టార్ తో తనకున్న అనుబంధాన్ని, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన తనకి ఉన్న అభిప్రాయాలు పంచుకోవడం ద్వారా మరోసారి మెగా అభిమానులకి దగ్గరయ్యాడనే మాట వినిపిస్తోంది.