బన్ని -త్రివిక్రమ్ భారీ పాన్ ఇండియన్ మూవీ
త్రివిక్రమ్ పాన్ ఇండియన్ సినిమాని తెరకెక్కించగలరని బన్ని నమ్ముతున్నారని కూడా బన్ని వాసు అన్నారు.
By: Tupaki Desk | 19 July 2024 5:16 PM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి-సన్నాఫ్ సత్యమూర్తి- అల వైకుంఠపురములో ఎలాంటి బ్లాక్ బస్టర్లు అయ్యాయో తెలిసిందే. అల వైకుంఠపురములో చిత్రం ఇండస్ట్రీ హిట్ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఈ కాంబినేషన్ రిపీట్ కానుందని సమాచారం. బన్ని- త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీకి స్టోరి లైన్ రెడీ అయిందని, దీనికోసం ఆ ఇద్దరూ రెండేళ్ల పాటు పని చేసారని బన్ని వాసు తెలిపారు. ఇది భారీ బడ్జెట్ తో రూపొందే అతి భారీ పాన్ ఇండియన్ మూవీ అని, నిధి సేకరణకే ఏడాది పడుతుందని బన్ని వాసు తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. త్రివిక్రమ్ పాన్ ఇండియన్ సినిమాని తెరకెక్కించగలరని బన్ని నమ్ముతున్నారని కూడా బన్ని వాసు అన్నారు.
20ఏళ్లుగా చూస్తూనే ఉన్నా:
బన్ని వాసు తాజా మీడియా ఇంటరాక్షన్‌లో మాట్లాడుతూ-''మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ కుటుంబం అంతా కలిసి వుండాలని కోరుకుంటార''ని అన్నారు. శుక్రవారం 'ఆయ్' థీమ్ సాంగ్ లాంచ్ సందర్భంగా ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు బన్నీవాస్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ-''కుటుంబంలో కొన్ని సందర్భాలు వస్తాయి.. మోర్ దేన్ ఎనీ థింగ్ వాళ్ల మధ్య వున్న అనుబంధం కానీ, వారి ఫ్యామిలీలు కలిసే సిట్యుయేషన్స్ కానీ నేను 20 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాను. చిరంజీవి గారు ఎప్పుడూ ఫ్యామిలీ అంతా కలిసి వుండాలని కోరుకుంటారు. అంతేకాదు ప్రతి సంవత్సరం ఫ్యామిలీ అందరిని సంక్రాంతికి బెంగళూరుకు తీసుకెళతారు. కుదిరిన ప్రతి ఒక్కరు అక్కడికి వెళతారు. దానిని ఆయన ఓ సెలబ్రేషన్‌లా చేస్తారు. దానికి కారణం ఫ్యామిలీ అంతా కలిసి వుండాలి అని ఆయన కోరుకోవడం. పిల్లలు ఎదిగినా..ఎవరి ట్రాక్‌లో వాళ్లు వున్నా ఫ్యామిలీ అంతా కలిసి వున్నాం.. మేమంతా ఒక్కటే అనే మేసేజ్ బయటికి పంపిస్తుంటారు. వాళ్ల వాళ్ల వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఫ్యామిలీలో కొన్ని కొన్ని పరిస్థితులు వస్తాయి. ఫ్యామిలీ అంతా ఆ సిట్యుయేషన్స్‌ను ఫేస్ చేయాల్సి వస్తుంది'' అని అన్నారు.
కుటుంబంలో తాత్కాలిక ఎమోషన్స్‌ను బేస్ చేసుకుని మెగా ఫ్యామిలీకి ప్రస్తుత సన్నివేశంతో లింక్ చేయడం తెలివైన నిర్ణయం కాదని బన్ని వాసు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే వారి అనుబంధం గురించి నాకు తెలుసు. వారి కుటుంబాల్లో ఒక్కరికి ఏదైనా సిట్యుయేషన్ వచ్చినా ఎలా వుంటారో తెలుసు. ఒకే ఒక్క సిట్యుయేషన్ చాలు ఇప్పుడున్న అన్ని రూమర్స్ చెక్ పెట్టడానికి... నేను కూడా దాని గురించే వెయిటింగ్. మేము అందరం కోరుకునేది ఒక్కటే. ఆ కుటుంబం బాగుండాలని.. బాగుంటుంది కూడా. ఇలాంటి రూమర్స్ పాసింగ్ క్లౌడ్స్! అన్నారు.