Begin typing your search above and press return to search.

అనుకుంటే దూకేయడమే.. ధైర్యం ఉన్నోడే ఇలాంటి సినిమా చేస్తాడు..!

అజయ్ భూపతి దర్శకత్వం లో తెరకెక్కిన మంగళవారం సినిమా ఈ నెల 17న రిలీజ్ కాబోతుంది.

By:  Tupaki Desk   |   12 Nov 2023 5:34 AM GMT
అనుకుంటే దూకేయడమే.. ధైర్యం ఉన్నోడే ఇలాంటి సినిమా చేస్తాడు..!
X

అజయ్ భూపతి దర్శకత్వం లో తెరకెక్కిన మంగళవారం సినిమా ఈ నెల 17న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా అల్లు అర్జున్ అటెండ్ అయ్యారు. ఈవెంట్ లో చిత్ర యూనిట్ అందరి గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ సూపర్ స్పీచ్ అందించారు.

స్వాతి నిర్మాతగా మారే టైం లో తన దగ్గరకు వచ్చి సలహా అడిగితే అనిపించినప్పుడు చేసే ఏదైనా సరే ముందు బురదలో దూకేయ్ ఆ తర్వాత ఏదో ఒకటి నేర్చేసుకోవచ్చని చెప్పాను. అజౌ భూపతి రెండేళ్ల క్రితం ఈ సినిమా కథ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది. ఇలాంటి సినిమా చేయాలంటే ధైర్యం ఉండాలి. అజయ్ భూపతి ఆరెక్స్ 100 సినిమా కూడా ఒక డిఫరెంట్ అటెంప్ట్ తో వచ్చింది. ఈ సినిమా కూడా కొత్తగా వస్తుంది. తప్పకుండా ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరారు అల్లు అర్జున్.

పాయల్ రాజ్ పుత్ కి కూడా ఆరెక్స్ 100 తర్వాత ఈ సినిమా ఒక మైల్ స్టోన్ మూవీగా నిలబడాలని అన్నారు. సినిమా టీజర్ టైం లోనే తాను షాక్ అయ్యానని పుష్ప సెట్ లో సుకుమార్ ఈ టీజర్ చూపిస్తే ఆయన కూడా షాక్ అయ్యానని చెప్పారు. కొన్ని సినిమాలు టీజర్, ట్రైలర్ చూస్తేనే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. ఈ సినిమాకు కూడా అలాంటి వైబ్ ఒకటి వస్తుందని అన్నారు.

స్నేహితులకు సాయం చేసే టైం చాలా తక్కువసార్లు వస్తుందని స్వాతి తనకు మంచి స్నేహితురాలు అందుకే ఈ వేడుకకు వచ్చానని. తనకు గీతా ఆర్ట్స్, బన్నీ వాసు, ఎస్.కె.ఎన్ నిర్మించే సినిమాల్లానే ఈ సినిమా కూడా సొంత సినిమా అని అన్నారు. పుష్ప షూటింగ్ నుంచి డైరెక్ట్ గా ఇటు వచ్చానని.. ప్రస్తుతం జాతర షూటింగ్ జరుగుతుందని మీ అందరినీ అలరించేలా సినిమా ఉంటుందని అన్నారు అల్లు అర్జున్. ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడిన అల్లు అర్జున్ అందరు ఫ్యాన్స్ హీరోల మీద అభిమానం నమ్మకం ఉంచుతారు. కానీ నేను మాత్రం మీ నమ్మకం, అభిమానంతో మంచి నా ప్రయాణం కొనసాగిస్తున్నా మీరు ఇలానే ఎంకరేజ్ చేస్తే ఇంకా అద్భుతమైన సినిమాలు చేస్తానని పుష్ప 2 తగ్గేదేలే కాదు అస్సలు తగ్గేదేలే అని అన్నారు అల్లు అర్జున్.