మళ్లీ తెరపైకి చరణ్ - బన్నీ కోల్డ్ వార్!
మెగాపవర్ స్టార్ రామ్చరణ్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య చాలా కాలం నుంచి కోల్డ్ వార్ జరుగుతున్నట్లు ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 17 Oct 2023 9:24 AM GMTమెగాపవర్ స్టార్ రామ్చరణ్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య చాలా కాలం నుంచి కోల్డ్ వార్ జరుగుతున్నట్లు ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఈ ప్రచారం తెరపైకి వచ్చింది. వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఇందుకు కారణమైంది.
వివరాళ్లోకి వెళితే.. సాధారణంగా ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన సినీ సెలబ్రిటీల మధ్య ఐక్యత కనపడకపోతే.. నెటిజన్లతో పాటు ట్రోలర్స్ రెచ్చిపోతారన్న సంగతి తెలిసిందే. అన్నదమ్ముళ్లు, తండ్రి కొడుకులు, బావ బామ్మర్దులు.. మామఅల్లుళ్ళు.. ఇలా ఎవరైనా.. ఒకరి సినిమాకు మరొకరు అండగా నిలిస్తేనే.. లేదా కొంచెం అనుమానం వచ్చినా సోషల్ మీడియాలో వారిని ఏకిపారేస్తారు.
అలా గత కొంత కాలంగా మెగా-అల్లు ఫ్యామిలీస్ మధ్య వార్ జరుగుతున్నట్లు ప్రచారం సాగుతూనే ఉంటుంది. కానీ అది లేదంటూ ఏదో ఒక సందర్భంలో వారు కొట్టి పారేస్తుంటారు. నాగబాబు, అల్లు అరవింద్ ఇప్పటికే ఈ విషయమై చాలా సార్లు మాట్లాడారు కూడా. అయితే ఈ మధ్య చరణ్-అల్లు అర్జున్ మధ్య మనస్పర్థలు అంటూ వార్తలు వచ్చాయి.
తాజగా జరిగిన ఓ సంఘటన ఆ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది. అదేంటంటే.. త్వరలోనే వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో నిర్వహించగా.. తాజాగా అల్లు అర్జున్ ఇంట్లో నిర్వహించారు.
ఈ ఈవెంట్కు మెగాఫ్యామిలీలోనే హీరోస్, డాటర్స్, ఇతర కుటుంబ సభ్యులు అందరూ హజరయ్యారు. బయటవారు కూడా హాజరై సందడి చేశారు. కానీ.. చరణ్-బన్నీ మాత్రం కనపడలేదు. మెగాస్టార్ ఇంట్లో పార్టీ నిర్వహించినప్పుడు బన్నీ కపడలేదు. అల్లు ఫ్యామిలీ ఇంట్లో ఈవెంట్ నిర్వహించినప్పుడు చరణ్ కనపడలేదు. మిగతా అందరూ కనిపించారు. సరదా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఫొటోలు దిగారు. కానీ చరణ్ ఇంట్లో బన్నీ.. బన్నీ ఇంట్లో చరణ్ లేకపోయేసరికి... దీంతో ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయన్న ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. ఆ అనుమానాలను మరింత ఎక్కువ చేసింది.