Begin typing your search above and press return to search.

AUDI కారులో బన్నీ.. భార్య ముందు తగ్గాల్సిందేనంటూ!

ఇప్పుడు తాజాగా.. ఆడి కారును నడిపి సందడి చేశారు బన్నీ. కార్స్ విత్ ట్రాక్స్ ఎడిషన్ లో ఆడిని డ్రైవ్ చేసి అలరించారు. స్పెషల్ రేస్ ట్రాక్ పై బ్లూ కలర్ ఆడి కారును నడిపి ఫుల్ ఎంజాయ్ చేశారు.

By:  Tupaki Desk   |   8 July 2024 7:56 AM GMT
AUDI కారులో బన్నీ.. భార్య ముందు తగ్గాల్సిందేనంటూ!
X

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్.. తన స్టైల్ ఆఫ్ లివింగ్ తో యూత్ ఐకాన్ గా, ఐకాన్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. యాక్టింగ్, డ్యాన్స్.. అలా అన్ని విషయాల్లో తనకంటూ ఓ స్పెషాలిటీ ఉండేలా ఎప్పుడూ చూసుకుంటారు. పుష్పతో నేషనల్ లెవెల్ లో క్రేజ్ దక్కించుకున్నారు. స్పెషల్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నారు. దీంతో ఆయన అప్ కమింగ్ మూవీస్ పై పాన్ ఇండియా లెవెల్ లో అందరి దృష్టి నెలకొంది.

అయితే బన్నీకి ఆటో మొబైల్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఈ విషయాన్ని అనేక సార్లు ప్రూవ్ చేస్తుకున్నారాయన. తన వ్యానిటీ వ్యాన్ ను దగ్గరుండి డిజైన్ చేయించుకున్నారు. అందులో లివింగ్ ఏరియా, ప్రీమియం లాంజ్, బెడ్ రూమ్, మేకప్ రూమ్ సహా అన్నీ ఉంటాయి. ఆ మధ్య తన కార్ టైర్లపై సిగ్నేచర్ AA మార్క్ వేయించుకున్నట్లు తెలిసింది. దీంతో ఆటో మొబైల్స్ పట్ల అల్లు అర్జున్ కు ప్రేమ, ఆసక్తి ఎంతలా ఉందో ఈజీగా అర్థమవుతుంది.

ఇప్పుడు తాజాగా.. ఆడి కారును నడిపి సందడి చేశారు బన్నీ. కార్స్ విత్ ట్రాక్స్ ఎడిషన్ లో ఆడిని డ్రైవ్ చేసి అలరించారు. స్పెషల్ రేస్ ట్రాక్ పై బ్లూ కలర్ ఆడి కారును నడిపి ఫుల్ ఎంజాయ్ చేశారు. తొలిసారి రేసింగ్ ట్రాక్ పై కారు నడిపిన ఎక్స్పీరియన్స్ అదిరిపోయిందని తెలిపారు బన్నీ. యాస్ మెరీనా ట్రాక్ పై ఆడి కారును బన్నీ డ్రైవ్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

అయితే హోస్ట్ తో ఇంటరాక్ట్ కూడా అయ్యారు బన్నీ. ఆ సమయంలో తన కామిక్ టైమింగ్ తో అలరించారు. మీరు వంగి కారు లోపలికి వెళ్లగలరా అని హోస్ట్ అడగ్గా.. ఎందుకు? ఏమైనా సమస్య ఉందా? అని అల్లు అర్జున్ తిరిగి ప్రశ్నించారు. దీంతో పుష్ప మూవీలో తగ్గేదేలే అంటారుగా అందుకే అలా అడిగానని హోస్ట్ నవ్వుతూ అన్నారు. అప్పుడు తనదైన శైలిలో సమాధానమిచ్చారు బన్నీ. అందుకు సంబంధించిన క్లిప్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.

'అవును నేను తగ్గగలను. నా భార్య ముందు అది అలవాటు పడ్డాను. వైఫ్ ముందు తగ్గాలి కదా' అంటూ నవ్వులు పూయించారు అల్లు అర్జున్. అయితే ఐకాన్ స్టార్ స్పాంటేనియస్ సమాధానానికి హోస్ట్ ఆశ్చర్యపోయారు. అయితే బన్నీ.. త్వరలో పుష్ప-2తో సందడి చేయనున్నారు. డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ మూవీతో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.