Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : పుష్ప రాజ్‌ ఫ్యామిలీ సెల్ఫీ వైరల్‌

అల్లు అర్జున్‌ కొన్ని రోజుల క్రితం ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   25 July 2024 7:28 AM GMT
పిక్ టాక్ : పుష్ప రాజ్‌ ఫ్యామిలీ సెల్ఫీ వైరల్‌
X

అల్లు అర్జున్‌ కొన్ని రోజుల క్రితం ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లిన విషయం తెల్సిందే. విదేశాలకు వెళ్లే సమయంలో ఆయన గడ్డం తీసి వేయడం తో పాటు, లుక్ కాస్త మార్చాడు అన్నట్లుగా టాక్‌ వినిపించింది. పుష్ప 2 సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న సమయంలో విదేశాలకు వెళ్లడం ఏంటో అనే చర్చ కూడా జరిగింది.


పుష్ప 2 గురించి, అల్లు అర్జున్‌ విదేశీ పర్యటన గురించి సోషల్ మీడియాలో పుంకాను పుంకాలుగా పుకార్లు షికార్లు చేయడం మనం చూశాం. అల్లు అర్జున్‌ ఫ్యామిలీతో కలిసి ఇంకా యూరప్‌ లోనే ఉన్నాడు. నార్వే లో ప్రస్తుతం హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.

తాజాగా స్నేహా రెడ్డి షేర్‌ చేసిన ఈ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అల్లు అర్జున్ ను హగ్‌ చేసుకోవడం, ఆయన వెనుక నుంచి కనిపించడం, లాంగ్‌ లో అర్హ కూడా అల్లరిగా కనిపించడం తో ఈ ఫోటో వైరల్ అవుతోంది. సాధారణంగానే బన్నీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం.

బన్నీ పూర్తి గా కనిపించకున్నా కూడా సోషల్‌ మీడియాలో ఈ ఫోటోకు నెటిజన్స్ నుంచి మంచి స్పందన దక్కింది. స్నేహా ఇలాంటి మంచి క్లిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆమె నుంచి వచ్చిన మరో బెస్ట్‌ క్లిక్ ఇది అంటూ బన్నీ ఫ్యాన్స్ తో పాటు అంతా కూడా తెగ షేర్‌ చేస్తున్నారు.

ఇక బన్నీ పుష్ప 2 సినిమా విషయానికి వస్తే సుకుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

మొదట ఆగస్టు లో సినిమా విడుదల అన్నారు, ఆ తర్వాత డిసెంబర్ కి వాయిదా వేశారు. ఇటీవల డిసెంబర్‌ లో అయినా పుష్ప 2 వస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అనుమానాలకు సుకుమార్‌ టీం నుంచి స్పందన రావాల్సి ఉంది. వచ్చే నెలలో బన్నీ షూటింగ్ కి రీ జాయిన్‌ అవుతాడని సమాచారం అందుతోంది.