Begin typing your search above and press return to search.

'పుష్ప 2'.. ఇదంతా తాత్కాలికమే!

దర్శక హీరోల మధ్య ఇగో క్లాష్ కారణంగా షూటింగ్ సాఫీగా సాగడం లేదని రూమర్స్ వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   18 July 2024 9:45 AM GMT
పుష్ప 2.. ఇదంతా తాత్కాలికమే!
X

మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ''పుష్ప 2''. మొదటి భాగం ఊహించని విధంగా నార్త్ లో భారీ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో, ఇప్పుడు అందరూ సెకండ్ పార్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది. అయితే ఇప్పుడు అనుకోని విధంగా ఈ చిత్రం వార్తల్లో నిలుస్తోంది. దర్శక హీరోల మధ్య ఇగో క్లాష్ కారణంగా షూటింగ్ సాఫీగా సాగడం లేదని రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ రాబోతున్న నాల్గవ సినిమా 'పుష్ప: ది రూల్'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 'పుష్ప 1' వచ్చిన ఏడాది లోపే రెండో భాగాన్ని రిలీజ్ చేస్తామని నిర్మాతలు చెప్పారు. కానీ అన్నీ అనుకున్నట్లు జరగలేదు. ముందుగా ఆగస్టు 15న విడుదల చెయ్యాలని ప్లాన్ చేసారు. షూటింగ్ పెండింగ్ ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ కు టైం సరిపోదనే ఉద్దేశ్యంతో డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు. అయితే సినిమా లేట్ అవడంతో బన్నీ - సుక్కూ మధ్య అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయని, హీరో దగ్గర నుంచి నిర్మాతల వరకూ ఇప్పుడు ఎవరూ సంతోషంగా లేరంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి.

నిజానికి 'పుష్ప' ప్రాజెక్ట్ కోసం అల్లు అర్జున్ చాలా సమయాన్ని వెచ్చించారు. 2020 నుంచీ ఈ సినిమా మీదనే వర్క్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ పూర్తైన తర్వాత మరే ఇతర చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లకుండా, 'పుష్ప 2' సినిమాకే పరిమితం అయ్యారు. దీని కారణంగా ఆయన పలు క్రేజీ ప్రాజెక్ట్స్ వదులుకున్నారనే టాక్ కూడా ఉంది. కావాల్సినంత టైం ఇచ్చినా సుకుమార్ ఇప్పటికీ ఫైనల్ కాపీని రెడీ చేయలేకపోతున్నారని బన్నీ అసహనం వ్యక్తం చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. అందుకే షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి,. గడ్డం ట్రిమ్ చేసి ఫ్యామిలీతో కలిసి హాలిడేకి వెళ్లినట్లుగా చెబుతున్నారు.

మరోవైపు సుకుమార్ - అల్లు అర్జున్ మధ్య అంతా బాగానే ఉందని, ఇవన్నీ ఒట్టి రూమర్స్ అనే మాట కూడా వినిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ సీజీ పనులు ప్రారంభించారని, ఎడిటింగ్ సమయంలో షూట్ కి బ్రేక్ తీసుకోవడం సర్వసాధారణమైన విషయమే అని బన్నీ టీం సభ్యులు అంటున్నారు. ఒకవేళ దర్శక హీరోల మధ్య మనస్పర్థలు వచ్చాయనే మాట నిజమే అయినా, ఇదంతా తాత్కాలికమే అని అభిమానులు భావిస్తున్నారు. వారం రోజుల్లో మళ్ళీ పెరిగే గడ్డం గురించి ఇంత చర్చ అవసరం లేదని కామెంట్లు చేస్తున్నారు.

ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది పక్కన పెడితే.. ఫైనల్ కాపీని సిద్ధం చేయడానికి సుక్కూకి చాలా టైం ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా పెండింగ్ షూటింగ్ పూర్తి చేస్తే, పోస్ట్ ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టొచ్చు. అలా కాకుండా ఇంకా ఆలస్యం చేస్తే, దాంతో సంబంధం ఉన్న వారి విలువైన సమయం వృధా అవ్వడమే కాదు.. నిర్మాతల మీద అధిక భారం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా 'పుష్ప 2' మీదున్న అంచనాలను బట్టి చూస్తే, ఇది ఎప్పుడు రిలీజైనా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పుడు టీమ్ మధ్య ఎన్ని సమస్యలు వచ్చినా, ఒక్కసారి సినిమా బ్లాక్ బస్టర్ అయితే అందరూ అన్నీ మార్చిపోతారనే అనుకోవాలి.