Begin typing your search above and press return to search.

క్లీంకార కి అల్లు అర్జున్‌ 'క్లీంకార' గిఫ్ట్‌

ఆమె పుట్టినప్పటి నుండి ప్రతి విషయం కూడా లోకల్‌ మీడియా నుండి జాతీయ మీడియా వరకు కవర్ చేయడం మనం చూశాం

By:  Tupaki Desk   |   2 Aug 2023 8:57 AM GMT
క్లీంకార కి అల్లు అర్జున్‌ క్లీంకార గిఫ్ట్‌
X

రామ్‌ చరణ్‌, ఉపాసనల కూతురు క్లీంకార పుట్టుకతోనే స్టార్‌ అయ్యింది. ఆమె పుట్టినప్పటి నుండి ప్రతి విషయం కూడా లోకల్‌ మీడియా నుండి జాతీయ మీడియా వరకు కవర్ చేయడం మనం చూశాం. క్లీంకార గురించి ఏ చిన్న విషయం అయినా కూడా జాతీయ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతున్న ఈ సమయంలో మరో ఆసక్తికర వార్త ఒకటి మీడియాలో చక్కర్లు కొడుతోంది.

గోల్డెన్‌ స్పూన్‌ తో పుట్టిన క్లీంకార కు ఎంతో మంది అత్యంత ఖరీదైన బహుమానాలు ఇచ్చారు.. ఇంకా ఇస్తూనే ఉన్నారు. తాజాగా అల్లు అర్జున్‌ దంపతులు కూడా క్లీంకారకు అరుదైన స్పెషల్‌ బహుమానంను ఇచ్చారట. ఆ గిఫ్ట్ కి ఉపాసన మరియు రామ్‌ చరణ్‌ కూడా సర్‌ ప్రైజ్‌ అయ్యారు అంటూ మెగా కాంపౌండ్ నుండి సమాచారం అందుతోంది.

క్లీంకార కు అల్లు అర్జున్‌ దంపతులు నేమ్‌ ప్లేట్ ను బహుమానంగా ఇవ్వడం జరిగిందట. నేమ్‌ ప్లేట్ లో ఏముంది అంత గొప్ప అనుకుంటున్నారా.. ఆ నేమ్ ప్లేట్‌ లో క్లీంకార పేరు ఉంది. అంతే కాకుండా ఆ నేమ్ ప్లేట్‌ లోని క్లీంకార అక్షరాలను బంగారంతో చేయించడంతో పాటు చుట్టు డైమండ్స్ పొదిగి ఉన్నట్లుగా చూసిన వారు చెబుతున్నారు.

మొత్తానికి రామ్ చరణ్ తన స్థాయికి తగ్గట్లుగా.. క్లీంకార హోదాకు తగ్గట్లుగా అద్భుతమైన బహుమానంను ఇచ్చాడు అంటూ మెగా కాంపౌండ్‌ లో ప్రచారం జరుగుతోంది. క్లీంకారకు ఎంతో మంది ఎన్నో అద్భుతమైన బహుమానాలు ఇచ్చారు. అల్లు అర్జున్‌ ఇచ్చిన బహుమానం చాలా స్పెషల్‌ గా నిలుస్తుందట.