Begin typing your search above and press return to search.

అల్లు అయాన్.. మోడల్ బోల్తే!

అయితే బన్నీ కొడుకు అయాన్ కాస్త సైలెంట్ గా కనిపించినా.. తెగ అల్లరి చేస్తుంటాడు. తాజాగా అల్లు అయాన్ పేరు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

By:  Tupaki Desk   |   21 Feb 2024 10:44 AM GMT
అల్లు అయాన్.. మోడల్ బోల్తే!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప మూవీతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన బన్నీ.. ఏకంగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డు సృష్టించారు. అయితే స్నేహరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత బన్నీలో చాలా మార్పు వచ్చిందని అంటుంటారు.

కొన్నేళ్లుగా అయితే సినిమా.. లేకుంటే కుటుంబం అన్నట్లుగా అల్లు అర్జున్ ఉంటున్నారట. మెయిన్ గా తన ఇద్దరు పిల్లలతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారట. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను బన్నీ వైఫ్ స్నేహ సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్ట్ చేస్తుంటారు. అందులో అల్లు అర్జున్ కూతురు అర్హ ఫొటోలు, వీడియోలు ఫుల్ ట్రెండ్ అవుతుంటాయి.

అయితే బన్నీ కొడుకు అయాన్ కాస్త సైలెంట్ గా కనిపించినా.. తెగ అల్లరి చేస్తుంటాడు. తాజాగా అల్లు అయాన్ పేరు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. అందుకు కారణం.. బన్నీ చేసిన ఓ కామెంట్. ఇటీవల అల్లు అర్జున్.. ఓ కార్యక్రమంలో ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ నిర్వహించారు. ఆ సమయంలో ఓ ఫ్యాన్.. అల్లు అయాన్ అంటూ గట్టిగా అరిచారు. వెంటనే బన్నీ... మోడల్ బోల్తే అంటూ సింబల్ చూపించారు.

దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ అంతా గట్టిగా అరుస్తూ సందడి చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. అల్లు అయాన్.. మోడల్ బోల్తే అంటూ కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో ఇంతకుముందు అల్లు అయాన్ అల్లరి చేసిన వీడియోలను కూడా షేర్ చేస్తున్నారు. వాటిని చూసి నెటిజన్లు అంతా నవ్వుకుంటున్నారు.

ఇటీవల అల్లు అర్జున్ మామయ్య కన్వెన్షన్ హాల్ ఓపెనింగ్ కు వెళ్లిన అల్లు అయాన్.. అక్కడ అందరినీ నవ్వించాడు. పూజా కార్యక్రమాల్లో అంతా బిజీగా ఉంటే.. అయాన్ మాత్రం కళ్లకు చేతులు అడ్డుపెట్టి చూశాడు. ఆ తర్వాత వన్ అంటూ ఫింగర్స్ చూపిస్తూ నవ్వించాడు. అంతకుముందు, నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా బన్నీ మీడియాతో మాట్లాడుతుండగా.. అద్దానికి అతుక్కుని కనిపించాడు. ఇటీవల ఫ్లోరల్ డ్రెస్ లో మోడల్ లా పోజిచ్చాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా మోడల్ బోల్తే అనడం విశేషం.