బన్నీ న్యూ లుక్స్.. ఇలా చూస్తే ఏ అమ్మాయైనా పడిపోవాల్సిందే
ఆగస్ట్ కవర్ ఆఫ్ ది 'ట్రావెల్ అండ్ లీజర్' బ్రాండ్‌కు సంబంధించి ఓ స్పెషల్ ఫొటోషూట్‌లో మైండ్ బ్లోయింగ్ అనేలా కనిపించారు.
By: Tupaki Desk | 12 Aug 2023 11:17 AM GMTఅల్లు అర్జున్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే! ఎందుకంటే ఆయనో ట్రెండ్ సెట్టర్. సినిమా సినిమాకి లుక్స్ మారుస్తూ.. సరికొత్త ట్రెండ్స్‌ను సృష్టిస్తుంటారు. అలా కేవలం యాక్టింగ్, డ్యాన్స్‌లో మాత్రమే కాదు లుక్స్ పరంగానూ ఎప్పటికప్పుడు వైవిధ్యంగా కనిపిస్తూ టాలీవుడ్ యూత్ ఫ్యాషన్ ఐకాన్‌గా మారారు. స్టైల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. అందుకే అభిమానులు ముద్దుగా స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ లైన్‌తో పిలుస్తుంటారు.
కాస్టూమ్స్ దగ్గర్నుంచి హెయిర్ స్టైల్ వరకు ఎప్పుడూ విభిన్నతను ప్రదర్శిస్తూ ఉంటారు బన్నీ. ఎప్పుడూ కూల్, కిల్లర్ అండ్ స్టైలిష్ లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంటారు. అలా తన స్టైలిష్ లుక్స్‌తో ఇటు సౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్‌లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
ఇప్పుడాయన పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ దక్కించుకుని ఐకాన్ స్టార్‌గా ఎదిగిపోయారు. తాజాగా మరో అదిరిపోయే లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను ఫిదా చేసేశారు. ఆగస్ట్ కవర్ ఆఫ్ ది 'ట్రావెల్ అండ్ లీజర్' బ్రాండ్‌కు సంబంధించి ఓ స్పెషల్ ఫొటోషూట్‌లో మైండ్ బ్లోయింగ్ అనేలా కనిపించారు.
లాంగ్ హెయిర్, గుబురు గడ్డం, కలర్‌ఫుల్ ఔట్ఫిట్లో రాకింగ్‌గా అదిరిపోయారు. మల్టీకలర్ షర్ట్, బ్లూ కలర్ ప్యాంట్, స్టైలిష్ కళ్లజోడు, షూస్ ధరించి మెస్మరైజ్ చేశారు. ఇంకో ఫొటోలో రింగుల జుట్టులో గ్రీన్ కలర్ లీఫీ డిజైన్ డబుల్ షర్ట్‌లో ఫిదా చేశారు. మిగతా ఫొటోస్‌లోనూ రకరకాల కూల్ అండ్ స్టైలిష్ మ్యాచింగ్ ఔట్ఫిట్స్ ధరించారు. టాప్ టు బాట్మ్ అదిరిపోయారు. అసలీ ఈ పిక్స్‌లోని బన్నీ స్టైల్, యాటిట్యూడ్ చూసిన ఇండియా వైడ్ అమ్మాయిలైతే ఈ ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు.
ఇకపోతే బన్నీ ప్రస్తుతం.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతో ఎదురుచూస్తున్న సినిమా 'పుష్ప2' నటిస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ భాషతో సంబంధం లేకుండా పుష్ప మేనరిజమ్‌తోనూ, డైలాగ్‌తోనూ ప్రపంచం మొత్తం ఊగిపోయింది. దానిని దృష్టిలో ఉంచుకుని సెకండ్ పార్ట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించడంతోపాటు, ఒకేసారి పలు భాషల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.