పుష్ప గడ్డం తీసిన తర్వాతే...!
అల్లు అర్జున్ గత మూడు సంవత్సరాలుగా పుష్ప సినిమా కోసం పొడవైన జుట్టు మరియు ఒత్తైన గడ్డంతో కనిపిస్తూ ఉన్నాడు
By: Tupaki Desk | 21 Aug 2024 10:11 AM GMTఅల్లు అర్జున్ గత మూడు సంవత్సరాలుగా పుష్ప సినిమా కోసం పొడవైన జుట్టు మరియు ఒత్తైన గడ్డంతో కనిపిస్తూ ఉన్నాడు. సోషల్ మీడియాలో గత మూడు సంవత్సరాలుగా అల్లు అర్జున్ ఆ లుక్ తో ఉన్న ఫోటోలను మాత్రమే షేర్ చేస్తూ వస్తున్నాడు. ఇంకా ఎన్ని రోజులు బన్నీ ని ఇలా గడ్డం మరియు పొడవైన జుట్టుతో చూడాలి అంటూ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు మూడు నెలల వరకు అల్లు అర్జున్ ను ఈ గెటప్ లోనే చూడాల్సి ఉంటుందని, ఆ తర్వాత ఆయన న్యూ లుక్ లోకి రావచ్చు అనే టాక్ వినిపిస్తుంది.
పుష్ప 2 సినిమాలో ప్రస్తుతం నటిస్తున్న అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ తో చేసేందుకు కమిట్ అయ్యాడు. కానీ వారి సినిమా పట్టాలు ఎక్కాలంటే అల్లు అర్జున్ గడ్డం తొలగించాలట. కనుక పుష్ప 2 సినిమా షూటింగ్ పూర్తి అయ్యే వరకు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు అల్లు అర్జున్ డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. డిసెంబర్ 6న పుష్ప 2 సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్ ను సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ముగించే విధంగా చాలా సన్నాహాలు జరుగుతున్నాయి.
అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ప్రమోషన్ లో కూడా గడ్డం తో కనిపిస్తాడా లేదంటే కొత్త లుక్ తో కనిపిస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద పుష్ప సాధించిన విజయం నేపథ్యంలో అంతకు మించి జాగ్రత్తలు తీసుకుంటూ దర్శకుడు సుకుమార్ పుష్ప 2 సినిమాను రూపొందిస్తున్న విషయం తెల్సిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇక అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీ విషయానికి వస్తే ఇప్పటికే కథ ఓకే అయ్యిందట. అల్లు అర్జున్ ఇటీవల త్రివిక్రమ్ చెప్పిన కథ కు ఓకే చెప్పాడని, స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేయాల్సిందిగా త్రివిక్రమ్ కి అల్లు అర్జున్ చెప్పాడని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాదిలోనే వీరి కాంబో పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో గతంలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. కనుక ఈ సినిమా తో డబుల్ హ్యాట్రిక్ నమోదు అయ్యేనా చూడాలి.