Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్.. ఈ ప్రాజెక్టు సెట్టయ్యేలా లేదు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 చిత్రం చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   17 Jun 2024 3:59 AM GMT
అల్లు అర్జున్.. ఈ ప్రాజెక్టు సెట్టయ్యేలా లేదు
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లేకుండా కొనసాగుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ మూవీ సిద్ధం అవుతోంది. మోస్ట్ అవైటెడ్ చిత్రంగా పుష్ప 2 సినిమా ఇప్పుడు ఉంది. దేశ వ్యాప్తంగా కూడా ఈ సినిమాపై భారీ హైప్ నెలకొని ఉంది. సుకుమార్ పెర్ఫెక్ట్ గా పుష్ప 2ని తీర్చి దిద్దుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేయబోయే మూవీ గురించి ఇప్పటికే ఒక టాక్ బయటకొచ్చింది.

పాన్ ఇండియా డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఉంటుందనే ప్రచారం నడిచింది. గీతా ఆర్ట్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమైంది. అయితే ఇప్పుడు సడెన్ గా ఈ మూవీ ఆగిపోయిందనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఇప్పటికే అట్లీ అల్లు అర్జున్ కోసం కథ సిద్ధం చేసి చెప్పారంట. మూవీకి ఎంత బడ్జెట్ అయిన పెట్టడానికి అల్లు అరవింద్ సిద్ధమయ్యారు. త్వరలో ఈ మూవీని ఎనౌన్స్ చేస్తారని అందరూ భావించారు.

అకస్మాత్తుగా ఈ సినిమా క్యాన్సిల్ అయ్యిందనే టాక్ బయటకొచ్చింది. దీనికి కారణం డైరెక్టర్ రెమ్యునరేషన్ అంట. మూవీ కోసం అట్లీ ఏకంగా 80 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడంట. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక దర్శకుడి హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్నది రు రాజమౌళి మాత్రమే. అతని తర్వాత స్థానంలో ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా ఉన్నారు. అయితే వీళ్ళు 50 నుంచి 60 కోట్ల మధ్యలోనే ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అట్లీ కూడా 50+ కోట్లకి పైనే రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడని టాక్. జవాన్ సినిమాకి అతను అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు బన్నీ చిత్రానికి ఏకంగా 80 కోట్లు డిమాండ్ చేయడంతో అల్లు అరవింద్ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టారని తెలుస్తోంది. ఆ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి అల్లు అరవింద్ సిద్ధంగా లేరనే మాట వినిపిస్తోంది. అందుకే ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం.

అయితే ఈ విషయం అధికారికంగా అయితే ఎవరూ కన్ఫర్మ్ చేయలేదు. కానీ టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. ఒక వేళ అట్లీ తప్పుకుంటే అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. అలాగే లిస్టులో సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్టు కూడా ఉంది.