Begin typing your search above and press return to search.

ఐకాన్ స్టార్ నెక్స్ట్.. టార్గెట్ 2027!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ కంప్లీట్ చేసిన తర్వాత చేయబోయే ప్రాజెక్ట్స్ ఏంటనే ప్రశ్న చాలా కాలంగా వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   16 July 2024 4:26 AM GMT
ఐకాన్ స్టార్ నెక్స్ట్.. టార్గెట్ 2027!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ కంప్లీట్ చేసిన తర్వాత చేయబోయే ప్రాజెక్ట్స్ ఏంటనే ప్రశ్న చాలా కాలంగా వినిపిస్తోంది. మొన్నటి వరకు అట్లీ దర్శకత్వంలో సినిమా ఉంటుందనే ప్రచారం నడిచింది. అయితే అతను 100 కోట్ల రెమ్యునరేషన్ అడిగాడంట. దీంతో అల్లు అరవింద్ అట్లీతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. నెక్స్ట్ పుష్ప సినిమాని బీట్ చేసే స్థాయిలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉండాలని అల్లు కాంపౌండ్ లో కొత్త కథలు వింటున్నారంట.

ఎక్స్ పెక్ట్ చేసిన రేంజ్ లో సరైన కథలు సెట్ కావడం లేదని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా నెల్సన్ దిలీప్ కుమార్ తో ఒక ప్రాజెక్టు ఉంటుందని టాక్ వచ్చింది. కానీ అది 5 నెలల కిందటి మాట. ఇప్పుడు ఆ కాంబినేషన్ పై అల్లు అర్జున్ పెద్దగా ఫోకస్ చేయడం లేదట. బన్నీ ఇప్పటికే త్రివిక్రమ్ తో ఓ మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు. ముందు ఓ కథ అనుకున్న కూడా అల్లు అర్జున్ పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని మైథాలజీ బేస్ చేసుకొని త్రివిక్రమ్ ఓ ఇంటరెస్టింగ్ స్టోరీని రెడీ చేస్తున్నారంట. ఈ స్టోరీపైన మాటల మాంత్రికుడు పూర్తిస్థాయిలో దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.

నెక్స్ట్ అల్లు అర్జున్ కూడా ఇదే సినిమా చేసే అవకాశం ఉంటుందంట. ఇప్పటికే వరకు కెరియర్ లో మైథాలజీ బేస్డ్ క్యారెక్టర్ ని అల్లు అర్జున్ చేయలేదు. బద్రీనాథ్ సినిమా చేసిన అది ప్రెజెంట్ స్టోరీతో ఉంటుంది. ఫిక్షనల్ మైథాలజీ టచ్ తో నడిచే కథాంశంతో ఆ సినిమా తెరకెక్కింది. అయితే బద్రీనాథ్ మూవీ డిజాస్టర్ అయ్యింది. త్రివిక్రమ్ మాత్రం పూర్తిగా మైథాలజీ బేస్డ్ కథని పీరియాడిక్ జోనర్ లోనే చెప్పబోతున్నారంట.

ఈ సినిమానే బన్నీ ఆల్ మోస్ట్ సెట్స్ పైకి తీసుకొని వెళ్లే ఛాన్స్ ఉందంట. నెల్సన్ చెప్పిన స్టోరీని ఒకే చెప్పారని గతంలో ప్రచారం నడిచింది. అయితే దీనిపై ఎలాంటి స్పష్టత లేదు. త్రివిక్రమ్ తో సినిమాని 2025లో స్టార్ట్ చేస్తే 2027 జనవరికి రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుందంట. కల్కి మూవీ తరహాలో ఈ సినిమా ఉండొచ్చనే ప్రచారం నడుస్తోంది. కల్కి సినిమా ఫ్యూచరిస్టిక్ట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది.

ఈ తరహాలో ఉండాలంటే అల్లు అర్జున్ మార్కెట్ రేంజ్ కి మించి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. త్రివిక్రమ్ కమర్షియల్ డైరెక్టర్ అయిన కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఇంకా అతని బ్రాండ్ ఎస్టాబ్లిష్ కాలేదు. గతంలో నాగ వంశీ మైథాలజీ కథని త్రివిక్రమ్ సిద్ధం చేస్తున్నారని చెప్పారు. అయితే అది ఎన్టీఆర్ తో ఉంటుందని అన్నారు. అదే కథని బన్నీకి సరిపోయే విధంగా త్రివిక్రమ్ ఏమైనా రెడీ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.