Begin typing your search above and press return to search.

నెం.1 హీరోయిన్‌ తో ఐకాన్ స్టార్‌...!

ఇక ఈ సినిమా లో బాలీవుడ్ నెం.1 హీరోయిన్ దీపికా పదుకొనే ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   30 Oct 2023 6:53 AM GMT
నెం.1 హీరోయిన్‌ తో ఐకాన్ స్టార్‌...!
X

అల్లు అర్జున్‌ పుష్ప సినిమా తో పాన్ ఇండియా స్టార్‌ హీరో అవ్వడంతో పాటు, జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం పుష్ప 2 సినిమా పనిలో అల్లు అర్జున్‌ ఉన్నాడు. ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమా లైనప్ చాలా పెద్దగా ఉంది. పుష్ప 2 సినిమా తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు బన్నీ గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడం జరిగింది.

ఇప్పటికే బన్నీ, త్రివిక్రమ్‌ కాంబోలో జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి, అల వైకుంఠపురం లో సినిమా లు వచ్చాయి. హ్యాట్రిక్ దక్కించుకున్న ఈ కాంబో లో మరో మూవీ వచ్చి డబుల్‌ హ్యాట్రిక్ నమోదు అవ్వబోతుంది అంటూ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ రూపొందించబోతున్న మొదటి పాన్‌ ఇండియా మూవీగా కూడా ప్రచారం జరుగుతోంది.

అల్లు అర్జున్‌ తో త్రివిక్రమ్‌ రూపొందించబోతున్న సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్‌ లేదు. కానీ కచ్చితంగా వీరి కాంబోలో రాబోతున్న మూవీ భారీ పాన్ ఇండియా మూవీగా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇక ఈ సినిమా లో బాలీవుడ్ నెం.1 హీరోయిన్ దీపికా పదుకొనే ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే తెలుగు హీరో ప్రభాస్ తో కల్కి సినిమాలో నటిస్తున్న దీపికా పదుకునే ముందు ముందు మరిన్ని సౌత్‌ సినిమాల్లో నటించేందుకు తాను సిద్దంగా ఉన్నట్లుగా ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అందుకే దీపికా పదుకునే ను తెలుగు లో మరిన్ని సినిమాల్లో చూడబోతున్నామని సినీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందబోతున్న సినిమాలో హీరోయిన్‌ గా దీపికా పదుకునే నటించబోతుండగా, కీలక పాత్రలో పూజా హెగ్డేను నటింపజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల వైకుంఠపురం లో సినిమాలో పూజా హెగ్డే నటించింది. ప్రస్తుతం త్రివిక్రమ్‌ రూపొందిస్తున్న మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డే ను హీరోయిన్ గా తీసుకుని డేట్ల సమస్య కారణంగా ఆమె ను తప్పించడం జరిగింది. అందుకే బన్నీ సినిమాలో ఆమెను నటింపజేయడం ద్వారా సెంటిమెంట్‌ ను కంటిన్యూ చేయాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.