Begin typing your search above and press return to search.

భర్త అంటే ఇలా ఉండాలి.. బన్నీ పోస్ట్‌ వైరల్‌

ఫ్యాన్స్ మాత్రమే కాకుండా చాలా విషయాల్లో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు బన్నీ.

By:  Tupaki Desk   |   6 March 2024 6:14 AM GMT
భర్త అంటే ఇలా ఉండాలి.. బన్నీ పోస్ట్‌ వైరల్‌
X

హీరో అంటే ఇలా ఉండాలి, నటుడు ఇతడిలా కష్టపడాలి, కొడుకు అంటే ఇలా ఉండాలి, అభిమానుల పట్ల ఇంత అభిమానం చూపించాలి, తండ్రి అంటే ఇలా ఉండాలని ఇలా పలు విషయాల్లో అల్లు అర్జున్‌ ను ఆయన అభిమానులు పొగుడుతూనే ఉంటారు. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా చాలా విషయాల్లో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు బన్నీ.


ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఆయన షేర్‌ చేసిన పోస్ట్‌ ఇతరుల భార్యలు అంతా కూడా కుల్లుకునే విధంగా ఉంది. నా భర్త కూడా బన్నీ ఎలాగైతే స్నేహాను ప్రేమిస్తాడో, ఎంతగా అయితే అభిమానిస్తాడో అంతగా నన్ను ప్రేమిస్తే బాగుండు అన్నట్లుగా ఆడవారు మాట్లాడుకునే విధంగా బన్నీ పోస్ట్‌ ఉంది.

అసలు విషయానికి వస్తే.. నేడు అల్లు అర్జున్‌, స్నేహాల వివాహ వార్షికోత్సవం. సాధారణంగానే భార్య స్నేహ పై ఎంతో ప్రేమను కురిపించే అల్లు అర్జున్‌ నేడు అంతకు మించి అన్నట్లుగా సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్‌ ను షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. భార్య స్నేహా పై తనకు ఉన్న ప్రేమను ఈ పోస్ట్‌ లో చూపించాడు.

స్నేహాతో ఉన్న ఫోటోను షేర్ చేసిన బన్నీ... హ్యాపీ అనివర్సరీ క్యూటీ, 13 ఏళ్లు పూర్తి అయ్యింది. నీతో బంధం కారణంగానే నేను ఇంత సంతోషంగా ఉన్నాను. నీవు నాకు ఎంతో శక్తిని ఇచ్చావు. మనం ఇద్దరం ఇలా మరిన్ని వివాహ వార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను అంటూ కామెంట్‌ పెట్టాడు.

బన్నీ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్‌ లో ఉన్నాడు. ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ ప్రత్యేక రోజును స్నేహా తో బన్నీ గడుపుతూ ఉంటాడు. ఈసారి కూడా వారి వివాహ వార్షికోత్సవ వేడుక హైదరాబాద్‌ లో సన్నిహితుల మధ్య జరుగబోతుంది. భార్య స్నేహాను ఇంత ప్రేమగా చూసుకుంటాడు కనుకే భర్త అంటే ఇలా ఉండాలని చాలా మంది ఆడవారు అంటున్నారు.