చెప్పను బ్రదర్ కంటే.. ఎక్కువైందిగా..
ఇక ఆ తరువాత బన్నీ అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 18 Jun 2024 1:51 PM GMTఅల్లు అర్జున్ గతంలో మెగా ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలని ఫ్యాన్స్ అరుపులకు ఊహించని విధంగా రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవర్ స్టార్ అంటుంటే.. చెప్పను బ్రదర్ అంటూ ఆ మధ్య హాట్ టాపిక్ గా నిలిచారు. ఇక ఆ తరువాత బన్నీ అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.
కానీ ఇటీవలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతు తెలపడం కోసం ఒక్క రోజు ప్రచారం చేసిన అల్లు అర్జున్, మెగా అభిమానుల్లో అసంతృప్తి రేకెత్తించారు. తన స్నేహితుడికి మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే తాను వెళ్లానని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని అల్లు అర్జున్ ఎంత వివరణ ఇచ్చినా, అది మెగా అభిమానులకు పెద్దగా నచ్చలేదు.
జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ మొత్తం పిఠాపురానికి వెళ్లి ప్రచారం చేస్తే, అదే సమయంలో అల్లు అర్జున్ నంద్యాలలో శిల్పా రవికి మద్దతుగా ప్రచారం చేయడం జనసేన అభిమానులను మరియు మెగా ఫ్యాన్స్ ను అసహనానికి గురిచేసింది. ఎన్నికలు ముగిసి నెల రోజులైనా ఈ వివాదం ఇంకా చల్లారలేదు. ఎన్నికల ఫలితాల తరువాత, ఈ వ్యతిరేకత మరింత తీవ్రమైంది. సోషల్ మీడియాలో బన్నీని టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ పెరిగింది.
రీసెంట్ గా పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. అల్లు అర్జున్ ను సోషల్ మీడియా ఖాతాల్లో అన్‌ఫాలో చేయడంతో, ఈ వివాదం మరింత చర్చనీయాంశమైంది. కొంతమంది మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని తాము ఇకపై అభిమానించబోమని, ఆయన సినిమాలు కూడా చూడబోమని ట్యాగ్స్ ట్రెండ్ అయ్యేలా రియాక్ట్ అవుతున్నారు. గతంలో చెప్పను బ్రదర్ అనే కామెంట్ కంటే ఇప్పుడు బైకాట్ పుష్ప ట్యాగ్ మరింత ట్రెండ్ అవుతోంది.
నా వ్యక్తిగత నిర్ణయం వలన పుష్ప చూడడం లేదని కూడా కౌంటర్స్ ఇస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెరుగుతున్నాయి. 'పుష్ప-2' చిత్రాన్ని తాము కుటుంబంతో కలిసి చూడడం మానుకోవాలని, జనసేన అభిమానులు మరియు కొంతమంది మెగా ఫ్యాన్స్ టెంప్లేట్ పోస్టులు పెడుతున్నారు. ఇది ఒకరి నుండి మరొకరికి పాకి, ఒక ట్రెండ్ లాగా మారుతోంది.
నిజానికి 'పుష్ప-2' వాయిదా పడటంలో అల్లు అర్జున్ మీద ఉన్న ప్రస్తుత నెగెటివిటీ కూడా ఒక కారణమని పరిశ్రమలో ఒక టాక్ అయితే వినిపిస్తోంది. బిజినెస్ మీద దాని ప్రభావం ఉంటుందని భావించి వాయిదా నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఈ పరిస్థితి కొన్ని నెలల తరువాత మారుతుందని భావించినా, సోషల్ మీడియాలో జనసేన అభిమానుల ఆగ్రహం చూస్తుంటే ఇప్పట్లో కూల్ అయ్యేలా లేరు. మరి పుష్ప 2 తో పాటు బన్నీ భవిష్యత్తుపై ఈ ప్రభావం ఎలా ఉంటుందో తెలియాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే.