Begin typing your search above and press return to search.

పుష్ప 3.. అల్లు అర్జున్ ప్లాన్ మార్చేశాడా..?

ఆగష్టులో పుష్ప 2 రిలీజ్ అవుతున్న సందర్భంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు

By:  Tupaki Desk   |   20 April 2024 5:50 AM GMT
పుష్ప 3.. అల్లు అర్జున్ ప్లాన్ మార్చేశాడా..?
X

ఆగష్టులో పుష్ప 2 రిలీజ్ అవుతున్న సందర్భంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. పుష్ప 1 సూపర్ హిట్ అవ్వడంతో పార్ట్ 2 మీద భారీ హైప్ ఏర్పడింది. అంచనాలకు తగినట్టు కాదు అంచనాలకు మించి సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 నుంచి వచ్చిన టీజర్ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడేలా చేసింది. అయితే పుష్ప 2 తో కథ ముగించే ఉద్దేశం లేని సుకుమార్ పుష్ప 3 ని కూడా ప్లాన్ చేస్తున్నారట.

పుష్ప 3 నెక్స్ట్ సమ్మర్ లోనే ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వచ్చింది. కానీ అల్లు అర్జున్ ప్లాన్ మార్చేసినట్టు తెలుస్తుంది. పుష్ప 3 విషయంలో అంత తొందర అవసరం లేదని చిన్నగా సినిమా మరో రెండేళ్లలో పూర్తి చేసేలా చర్చలు చేస్తున్నారట. పుష్ప 1 తో మొదలైన కథ పుష్ప 2 తో పూర్తి చేసి పార్ట్ 3 కి కొత్త కథతో పుష్ప రాజ్ పాత్రని కొనసాగిస్తారని ఓ టాక్ ఉంది.

పుష్ప 2 తర్వాత త్రివిక్రం, అట్లీ ఇద్దరు దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎదురుచూస్తున్నారు. సో ఆ సినిమాలు పూర్తి చేశాక పుష్ప 3 చేసే ఆలోచనలో ఉన్నాడు అల్లు అర్జున్. పుష్ప 3 ఉంటుంది కానీ దానికి మరో రెండు మూడేళ్లు టైం పడుతుందని అంటున్నారు. పుష్ప 3 కి ముందు అల్లు అర్జున్ రెండు మూడు సినిమాలు పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆల్రెడీ త్రివిక్రం తో అల్లు అర్జున్ చేసే సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని టాక్.

అట్లీతో సినిమా నెక్స్ట్ ఇయర్ ఉండే ఛాన్స్ ఉంది. ఇక సందీప్ వంగా తో కూడా అల్లు అర్జున్ సినిమా కూడా లైన్ లో ఉంది. సో ఈ సినిమాలు పూర్తి చేశాకనే పుష్ప 3 అది కూడా కథ పర్ఫెక్ట్ గా కుదిరితే చేయాలని అల్లు అర్జున్ డిసైడ్ అయ్యాడట. పుష్ప రాజ్ పాత్రకు క్రేజ్ ఉంది కదా అని ఎలా పడితే అలా సినిమా చేయకుండా ఆ పాత్రకు.. చేసే సినిమాకు వెయిట్ ఉండేలా స్కెచ్ వేస్తున్నాడు అల్లు అర్జున్. సో 2025 లోనే పుష్ప 3 వస్తుందని కొందరు చేస్తున్న హడావిడికి ఇక చెక్ పెట్టేయొచ్చు.