బన్నీ రికార్డ్ మైల్స్టోన్.. ఆయన అవార్డ్స్ లిస్ట్ ఇదే
తాజాగా ఈ చిత్రంతో ఇప్పుడు బన్నీ నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుని.. తెలుగు సినిమా తలెత్తుకునేలా చేశారు.
By: Tupaki Desk | 26 Aug 2023 12:31 PM GMTస్నేహం కోసం ప్రేమను త్యాగం చేసే 'ఆర్య' ఆయన. దేశముదురుగా కనిపించినా.. జులాయిగా తిరిగినా.. డీజే అంటూ యాక్షన్ చేసినా.. ఆయన అభిమానులు ఫుల్ హ్యాపీ. ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసే సరైనోడు ఆయన. 'విలువలే ఆస్తి' అని తండ్రి కోసం ఏదైనా చేసే ఓ మంచి కొడుకు. అన్న కోసం ఎవడినైనా ఎదురించగలే రేసుగుర్రం. ఆయనే... ఆడా.. ఈడా ఉంటూ అటు క్లాస్ ఆడియన్స్‌ను, ఇటు మాస్ ప్రేక్షకులను అలరిస్తున్న బాక్సాఫీస్ పుష్ప రాజ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్.
తాజాగా ఆయన.. 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు..' అంటూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుకు ఎంపికై చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్.. ఇలా అన్నీ ఇండియావైడ్‌గా సినీ ప్రేక్షకులను తన మాస్ అవతార్‌తో మెప్పించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించడంతో పాటు బన్నీ ఖాతాలోకి పలు రికార్డులు కూడా చేరాయి.
తాజాగా ఈ చిత్రంతో ఇప్పుడు బన్నీ నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుని.. తెలుగు సినిమా తలెత్తుకునేలా చేశారు. అయితే ఈ అవార్డుతో ఆయన తన అవార్డ్స్ లిస్ట్‌లో ఓ మైలురాయిని చేరుకున్నారు.
తాజా నేషనల్ అవార్డ్‌తో కలిపి తన కెరీర్లో 50వ అవార్డుకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. 'విజేత', 'స్వాతిముత్యం' వంటి సినిమాలతో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన 'డాడీ' సినిమాలో డ్యాన్సర్‌గా ఓ చిన్న పాత్రలో మెరిశారు. ఆ తర్వాత 'గంగోత్రి'తో హీరోగా తెరంగేట్రం చేసి తొలి సినిమాతోనే అవార్డును అందుకున్నారు. అప్పుటి నుంచి కెరీర్లో ఎదురైన ప్రతి సవాల్‌ను, విమర్శలను స్వీకరించి నటుడిగా తనని తాను అద్భుతంగా మలుచుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాలు చేసి స్టార్‌గా ఎదిగారు. అయితే ఈ జర్నీలో తాను నటించిన ప్రతి సినిమాతో ఏదో ఒక అవార్డును ముద్దాడారు. అలా ఇప్పుటివరకు 50 అవార్డులను స్వీకరించారు.
వాటిలో గంగోత్రికి 3, ఆర్య 4, బన్నీ 1, దేశముదురు 2, పరుగు 5, ఆర్య 2-2, వేదం 3, బద్రినాద్ 1, ఇద్దరు అమ్మాయిలతో 1, రేసుగుర్రం 5, సన్నాఫ్ సత్యమూర్తి 1, రుద్రమదేవి 6, సరైనోడు 2, అలవైకుంఠపురంలో 4, పుష్ప 4(జాతీయ అవార్డుతో కలిపి), ఇంకా పలు అవార్డులను కూడా ముద్దాడారు.