అల్లు అర్జున్ పై ఫోకస్ పెంచిన బడా సంస్థ!
అయితే ఈ సినిమాతో అల్లు అర్జున్ బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల టార్గెట్ ను టచ్ చేయాలి అనే ఆలోచనతో ఉన్నాడు
By: Tupaki Desk | 13 March 2024 6:16 PM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సెకండ్ పార్ట్ సినిమాతో తప్పకుండా అంతకుమించి అనేలా సక్సెస్ అందుకుంటాడు అని ఫ్యాన్స్ అయితే ఎంతో నమ్మకంతో ఉన్నారు దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను భారీ స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు మైత్రి మూవీ మేకర్స్ కూడా బడ్జెట్ విషయంలో ఏమాత్రం లిమిట్స్ లేకుండా గ్రాండ్ గా నిర్మిస్తోంది. దాదాపు 300 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో బలమైన టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ సినిమాతో అల్లు అర్జున్ బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల టార్గెట్ ను టచ్ చేయాలి అనే ఆలోచనతో ఉన్నాడు. అంతేకసిగా సినిమా కోసం అతను హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాడు. ఇక సినిమాకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు కూడా ఇప్పటికే మొదలైనట్లుగా తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ మాత్రం తొందరపడకుండా మంచి డీల్స్ తో టేబుల్ ప్రాఫిట్ అందుకోవాలి అని చూస్తోంది.
ఇక అల్లు అర్జున్ క్రేజ్ గురించి తెలుసుకుంటున్న ఇండియన్ టాప్ ఫిలిం ప్రొడక్షన్ కంపెనీలు అతనిపై ఫోకస్ పెంచాయి. అయితే చాలా కాలంగా కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కూడా బన్నీతో సినిమా చేయాలనే ఆలోచనతో ఉంది. పుష్ప 1 సక్సెస్ కాగానే ఆ సంస్థ బన్నీని కూడా ప్రత్యేకంగా కలవడం జరిగింది. కానీ అప్పుడే ఐకాన్ స్టార్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
అయితే డైరెక్ట్ గా కథతోనే బన్నీని ఒప్పించాలి అని ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఇక అందులో భాగంగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీని కూడా రంగంలోకి దింపినట్లు సమాచారం. ఇటీవల కాలంలో అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ గురించి చాలా రకాల గాసిప్స్ వచ్చాయి. ఈ కాంబినేషన్ నే సన్ పిక్చర్స్ నిర్మించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఇచ్చే అవకాశం ఉందట.
పుష్ప 2 సక్సెస్ అయితే మాత్రం బన్నీ రెమ్యునరేషన్ ఒక్కసారిగా 100 కోట్లను దాటుతుంది అని చెప్పవచ్చు. అయితే ఆ రేంజ్ లో కూడా ఇవ్వడానికి ఈ ప్రొడక్షన్ హౌస్ సిద్ధంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల జైలర్ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న సన్ పిక్చర్స్ ఇప్పుడు అంతకుమించి అనేలా సినిమాలను తెరపైకి తీసుకురావాలి అని అడుగులు వేస్తోంది. ఇక అట్లీ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ సెట్ అయితే మాత్రం ఆ సంస్థకు మరింత బలం చేకూరుతుంది. మరి అల్లు అర్జున్ ఆ సంస్థకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.