Begin typing your search above and press return to search.

బన్నీ బిగ్ అప్డేట్.. ఇకపై అన్నీ అక్కడే!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప మూవీతో ఎలాంటి క్రేజ్ దక్కించుకున్నారో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 Aug 2024 8:18 AM GMT
బన్నీ బిగ్ అప్డేట్.. ఇకపై అన్నీ అక్కడే!
X

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప మూవీతో ఎలాంటి క్రేజ్ దక్కించుకున్నారో అందరికీ తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఆ సినిమాతో నేషనల్ వైడ్ గా ఫ్యాన్స్ సంపాదించుకున్నారు. ఆ సినిమాకు గాను నేషనల్ అవార్డు కూడా అందుకుని అరుదైన ఘనత సాధించారు. ఇప్పుడు పుష్ప-2 మూవీతో బిజీగా ఉన్నారు. త్వరలో ఆ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు బన్నీ.

ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్స్ షెడ్యూల్స్ తో బిజీబిజీగా గడుపుతున్నారు బన్నీ. వరుస షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. త్వరలోనే తన పార్ట్ ను పూర్తి చేసుకోనున్నారు. డిసెంబర్ 6వ తేదీన థియేటర్లలో సందడి చేయనున్నారు. అయితే రిలీజ్ డేట్ పై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నా.. కచ్చితంగా చెప్పిన తేదీకే సినిమా తీసుకొస్తామని రీసెంట్ గా అనౌన్స్ చేశారు బన్నీ అండ్ సుకుమార్. దీంతో ఆయన అభిమానులు మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు.

ఇప్పుడు టాలీవుడ్ సినీ వర్గాల్లో అల్లు అర్జున్ కు సంబంధించిన ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం తాను ఉంటున్న ఇల్లు, ఆఫీస్ ను షిఫ్ట్ చేయాలని బన్నీ ఫిక్స్ అయ్యారట. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని వెంకటగిరి ఏరియాలో కొత్త బిల్డింగ్ ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అందులోనే తన నివాసంతోపాటు ఆఫీస్ ను ఏర్పాటు చేసుకోనున్నట్లు సమాచారం. ఇకపై బన్నీ.. అక్కడి నుంచే అన్ని వ్యవహారాలు చూడనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే బన్నీ కొత్త బిల్డింగ్ సుమారు 3000 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మిస్తున్నారని సమాచారం. సకల సౌకర్యాలు, అన్ని రకాలు వసతులతో ఫుల్ లగ్జీరియస్ గా కడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 50-60 శాతం నిర్మాణం పూర్తైనట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకుని అల్లు అర్జున్ సతీసమేతంగా గృహప్రవేశం చేస్తారని సన్నిహితులు చెబుతున్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల కాస్ట్లీ ఇళ్లలో బన్నీ కొత్త హౌస్ ఒకటిగా నిలవనుందట.

కాగా, బన్నీ కొత్త బిల్డింగ్.. దివంగత రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇంటికి సమీపంలో ఉందట. మైత్రీ మూవీస్ ఆఫీస్ పక్కనే అల్లు అర్జున్ కొత్త ఇల్లు నిర్మిస్తున్నారని సమాచారం. మొత్తానికి బన్నీ తన బ్రాండ్ వాల్యూని ఓ రేంజ్ లో పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అర్జునా మజాకా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి బన్నీ కొత్త బిల్డింగ్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.