సరైన చోట.. స్టార్ హీరోకు రెండో మల్టీప్లెక్స్!
ఇప్పుడు ఐకాన్ స్టార్ ఫోకస్ విశాఖ మీద పడినట్లు తెలుస్తోంది. ఏపీలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా విశాఖపట్నం ఉంది.
By: Tupaki Desk | 18 March 2024 5:25 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే హైదరాబాద్ లో ఏషియన్ వారితో కలిసి సత్య థియేటర్ కి తీసుకొని ఏషియన్ వారితో AAA మల్టీప్లెక్స్ గా మార్చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. అమీర్ పేట సెంటర్ కావడంతో ఈ మల్టీప్లెక్స్ థియేటర్స్ కి ఫుల్ డిమాండ్ ఉంది. మహేష్ బాబు ముందుగా మల్టీప్లెక్స్ థియేటర్స్ బిజినెస్ లోకి అడుగుపెడితే అతని దారిలో అల్లు అర్జున్ వచ్చాడు. వీరి దారిలో రవితేజ, విజయ్ దేవరకొండ కూడా మల్టీప్లెక్స్ థియేటర్స్ ని స్టార్ట్ చేస్తున్నారు.
ఇప్పుడు ఐకాన్ స్టార్ ఫోకస్ విశాఖ మీద పడినట్లు తెలుస్తోంది. ఏపీలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా విశాఖపట్నం ఉంది. ఇప్పటికే మల్టీప్లెక్స్ లు, షాపింగ్ మాల్స్ అక్కడ వెలిశాయి. వాటికి ఫుల్ డిమాండ్ కూడా ఉంది. సింగిల్ స్క్రీన్స్ కంటే మల్టీ ప్లెక్స్ లో సినిమాలు చూడటానికి అక్కడ జనం ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే బన్నీ దృష్టి అక్కడ పడినట్లు తెలుస్తోంది.
ఏషియన్ వారితో కలిసి విశాఖలో మల్టీప్లెక్స్ థియేటర్స్ లో స్టార్ట్ చేయడానికి అల్లు అర్జున్ ఇప్పటికే ఒప్పందం చేసుకున్నాడంట. హైదరాబాద్ తరహాలోనే వైజాగ్ లో కూడా ఇనార్బిట్ మాల్ సిద్ధం అవుతోంది. ఇనార్బిట్ మాల్ లోనే అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ థియేటర్స్ ని ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది. మాల్ తోపాటే థియేటర్స్ కూడా ఓపెన్ అవుతాయని సమాచారం.
ఇనార్బిట్ మాల్ ఓపెన్ అయితే దానికి పబ్లిక్ తాకిడి అధికంగానే ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఐకాన్ స్టార్ అందులో మల్టీప్లెక్స్ ని ఏషియన్ వారితో కలిసి సొంతం చేసుకున్నాడంట. బన్నీ దారిలోనే మిగిలిన స్టార్స్ కూడా వైజాగ్ పైన ఫ్యూచర్ లో ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. రానున్న ఎన్నికలలో ఎవరు అధికారంలోకి వచ్చిన విశాఖపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టే ఛాన్స్ ఉంటుంది.
టూరిజం పరంగా ఏపీకి ఉన్న ఎట్రాక్టివ్ సిటీ విశాఖపట్నం. విశాఖ జిల్లాలో గోవా తరహాలో బీచ్ టూరిజం అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎకో టూరిజంకి కావాల్సినంత స్కోప్ ఆరుకు, పాడేరు, బొర్రా కేప్స్, లంబసింగి లాంటి అటవీ ప్రాంతాలలో అవకాశం ఉంది. త్వరలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కూడా ప్రారంభం కానుంది. ఇవన్నీ కూడా విశాఖలో మల్టీప్లెక్స్ కి డిమాండ్ పెరిగేలా చేస్తున్నాయి.