Begin typing your search above and press return to search.

ఆయ్.. అల్లు అర్జున్ ఏమన్నారంటే..

ఈ ప్రఖ్యాత నటుడు, చిన్న బడ్జెట్ సినిమాలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు అని చెప్పవచ్చు.

By:  Tupaki Desk   |   13 Aug 2024 7:37 AM GMT
ఆయ్.. అల్లు అర్జున్ ఏమన్నారంటే..
X

'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్ తన ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ తో తెలుగు చిత్రసీమలో ఐకాన్ స్టార్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రఖ్యాత నటుడు, చిన్న బడ్జెట్ సినిమాలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు అని చెప్పవచ్చు. ఈసారి, ఆయన తన సన్నిహితులకు చెందిన కొత్త చిత్రం 'AAY'కు సపోర్ట్ గా నిలిచారు. GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం, గోదావరి నేపథ్యంలో ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


'మ్యాడ్' ఫేమ్ నర్ణే నితిన్, నయన్ సారికా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఈ సినిమాకు అంజి కె. మణిపుత్రా దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక చిత్ర విడుదలకు ముందు నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో, అల్లు అర్జున్ తన సన్నిహిత మిత్రుడు బన్నీ వాస్, తన సోదరి విద్యా కొప్పినీడి మొత్తం టీమ్‌కు ప్రత్యేకంగా బెస్ట్ విషెస్ తెలియజేశారు.

అసలైతే మొదట ఈ సినిమా ఈవెంట్ కోసం అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిధులుగా వచ్చే అవకాశం ఉందని రకరకాల కామెంట్స్ వచ్చాయి. అయితే ఆ ఇద్దరు ప్రస్తుతం వారి సినిమాల షూటింగ్స్ తో చాలా బిజీగా ఉన్నారు. ఇక సినిమా వేడుక కోసం గ్లామరస్ హీరోయిన్ శ్రీలీల రానుంది. ఇక అల్లు అర్జున్ ప్రత్యేకంగా తన విషెస్ అయితే అందించారు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ, “నా స్నేహితుడు బన్నీ వాస్ గారికి, నా ప్రియమైన సోదరి విద్యా కొప్పినీడి కి, మరియు ‘ఆయ్’ మూవీ టీమ్‌కి నా శుభాకాంక్షలు. ఈ సినిమా మీకు విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను” అని తెలియజేశారు. ‘ఆయ్’ చిత్రానికి ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ ఏర్పడింది. ప్రత్యేకమైన ప్రమోషనల్ కంటెంట్ వీడియోలతో సినిమా పై మరింత క్యూరియాసిటీ క్రియేట్ అయింది.

ఈసారి గోదావరి ప్రాంతం నేపథ్యంతో వస్తున్న ఈ కామెడీ ఫిల్మ్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. మరి అల్లు అర్జున్ వంటి స్టార్ సపోర్ట్ పొందిన ఈ చిన్న చిత్రం ‘AAY’ ప్రేక్షకుల ముందు ఏ విధంగా రాణిస్తుందో చూడాలి. సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుంది.