పిఠాపురం పోటీపై మౌనం వీడిన బన్నీ!
ఈ నేపథ్యంలో తాజాగా కొద్ది సేపటి క్రితమే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ విషెస్ తెలియజేస్తూ ఓ ట్వీట్ చేసారు.
By: Tupaki Desk | 9 May 2024 11:54 AM GMTఏపీలో ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఎక్షలన్ కి ఇంకా నాలుగు రోజులే సమయం ఉంది. దీంతో నాయకులంతా ప్రజల్లోనే తిరుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఒక ఎత్తైతే పిఠాపురం పవన కళ్యాణ్ పోటీ చేస్తోన్న నియోజక వర్గం మరో ఎత్తులా మారింది. ఈ నియోజక వర్గంలో గెలుపై ఎవరికి వారు ధీమాగా కనిపిస్తున్నారు. ఇక పవన్ కోసం ప్రచారం చేయడానికి జబర్దస్త్ కమెడియన్లు- సీరియళ్లు ఆర్టిస్టులు దిగి పది-పదిహేను రోజులుగా అదే పనిమీద ఉన్నారు.
అలాగే మెగా ఫ్యామిలీ నుంచి కూడా మెగా మేనల్లుళ్లు..వరుణ్ తేజ్...నాగబాబు భార్య పద్మజ కూడా ఇంటింటా తిరిగి ప్రచారం చేసారు. మెగాస్టార్ చిరంజీవి..రామ్ చరణ్ కూడా పిఠాపురం వచ్చి ప్రచారం చేస్తారని ప్రచారం సాగుతుంది.
అయితే అల్లు ఫ్యామిలీ నుంచి మాత్రం ఇంతవరకూ ఎవరూ స్పందించలేదు. అటు అల్లు అరవింద్ గానీ..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గానీ....శిరీష్ గానీ ఎవరూ పవన్ పోటీ గురించి ఎక్కడా ఏ సందర్భంలోనూ మాట్లాడింది లేదు.
తొలి నుంచి ఆ ఫ్యామిలీ జనసేన పార్టీ విషయంలో మౌనం వహిస్తూనే ఉంది. ఎన్నికలు దగ్గర పడినా కూడా ఎవరూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా కొద్ది సేపటి క్రితమే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ విషెస్ తెలియజేస్తూ ఓ ట్వీట్ చేసారు. 'పవన్ కళ్యాణ్ గారూ మీ ఎన్నికల ప్రయాణంలో. మీ జీవితాన్ని సేవకే అంకితం చేస్తూ మీరు ఎంచుకున్న మార్గం గురించి నేను ఎప్పుడూ గర్వపడుతున్నాను. కుటుంబ సభ్యునిగా, నా ప్రేమ మరియు మద్దతు మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు అనుకున్నది సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను' అంటూ రాసుకొచ్చారు.
దీంతో అల్లు వారి మద్దతు కూడా పవన్ కళ్యాణ్ కి దక్కినట్లు అయింది. ఇండస్ట్రీ నుంచి చిన్న చిన్న నటులంతా పవన్ కి మద్దతు పలికిన సంగతి తెలిసిందే. అలాగే నిర్మాత నాగవంశీ కూడా పవన్ తరుపున ప్రచారం చేస్తున్నారు. ఇంకా ప్రచారానికి రెండు రోజులే సమయం ఉన్న నేపథ్యంలో చిరంజీవి- చరణ్ కూడా పిఠాపురం వస్తారా? లేదా? అన్నది చూడాలి. అభిమానులు మాత్రం ఆ ఇద్దరు కూడా రావాలని కోరుకుంటున్నారు. అలాగే మే 19న డైరెక్టర్స్ డే ఈవెంట్‌కి ఆహ్వానించడానికి TFDA కమిటీ సభ్యులు ఈరోజు అల్లు అర్జున్ ని కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బన్నీకమిటీకి 10 లక్షల చెక్కును ఆర్దికసహాయంగా అందించారు. కొత్త భవనం నిర్మాణానికి తన సహకారం ఉంటుందన్నారు.