Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ - త్రివిక్రమ్.. 40 ఏళ్ళ హీరోయినా?

ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న బన్నీ ఆ సినిమాను 2024 ఆగస్టులో విడుదల చేయబోతున్నాడు.

By:  Tupaki Desk   |   21 Nov 2023 10:45 AM GMT
అల్లు అర్జున్ - త్రివిక్రమ్.. 40 ఏళ్ళ హీరోయినా?
X

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కూడా ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్ పై అధికారికంగా క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న బన్నీ ఆ సినిమాను 2024 ఆగస్టులో విడుదల చేయబోతున్నాడు. ఇక మరోవైపు దర్శకుడు త్రివిక్రమ్ మహేష్ బాబుతో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా 2024 జనవరి సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. ఈ ప్రాజెక్టు విడుదలైన తర్వాత వెంటనే త్రివిక్రమ్ AA22 సినిమా కోసం ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేయనున్నాడు. ఆల్ రెడీ అసలు కథ గురించి ఇదివరకే చర్చించడం కూడా జరిగింది. ఫ్రీడమ్ ఫైట్ నేపథ్యంలో పిరియాడికల్ డ్రామా గా ఆ సినిమా ఉండబోతుందట. ఆ ప్రాజెక్టును ఫ్యాన్ వరల్డ్ రేంజ్ లో తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నారు.

ఇంకా హారిక హాసిని గీతా ఆర్ట్స్ నెవ్వర్ బిఫోర్ అనేలా ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 300 కోట్ల వరకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా ఇండస్ట్రీలో వైరల్ గా మారుతున్నాయి. హీరోయిన్ విషయంలో కూడా త్రివిక్రమ్ ఒక నిర్ణయానికి రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఓ 40 ఏళ్ళ వయసులో ఉన్న హీరోయిన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట.

కథకు తగ్గట్టుగా ఆమె పర్ఫెక్ట్ అని ఆలోచిస్తున్నారట. ఆమె మరెవరో కాదు త్రిష అని తెలుస్తోంది. త్రిష వయసు ప్రస్తుతం 40 ఏళ్లు. ఇక అల్లు అర్జున్ వయసు 41. ఇద్దరికీ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది కానీ ఫ్యాన్స్ ఈ కాంబినేషన్ ను ఎంతవరకు ఒప్పుకుంటారు అనేది వేచి చూడాలి. త్రివిక్రమ్ గతంలో త్రిషను అతడు సినిమాలో తీసుకున్న విషయం తెలిసిందే. ఇక మళ్లీ ఇన్నాళ్ల తర్వాత వారి కలయికపై చర్చలు మొదలయ్యాయి.

ఒక విధంగా త్రిష ప్రస్తుతం అయితే మంచి ఫామ్ లో ఉంది. లియో సినిమాతో కూడా కమర్షియల్ గా సాలీడ్ సక్సెస్ వచ్చింది. ఇక త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ అంటే తప్పకుండా కథకు ప్రాధాన్యత ఉన్న పాత్ర ఆఫర్ చేసి ఉంటారు. ఇక త్రివిక్రమ్ ఇటీవల కాలంలో ప్రతీ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ను తీసుకుంటూ వస్తున్నాడు. ఇక AA22లో త్రిషను స్పెషల్ పాత్ర కోసం తీసుకొని బన్నీకి జోడిగా మరొకరిని తీసుకునే అవకాశం కూడా ఉండవచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో.