Begin typing your search above and press return to search.

హాయ్ నాన్నకు బన్నీ ఫిదా.. నాని అదుర్స్ అంటూ..

నేచురల్ స్టార్ నాని, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా న‌టించిన హాయ్ నాన్న హిట్ టాక్ తో దూసుకుపోతోంది.

By:  Tupaki Desk   |   11 Dec 2023 7:34 AM GMT
హాయ్ నాన్నకు బన్నీ ఫిదా.. నాని అదుర్స్ అంటూ..
X

నేచురల్ స్టార్ నాని, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా న‌టించిన హాయ్ నాన్న హిట్ టాక్ తో దూసుకుపోతోంది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో సాగే ఈ మూవీకి శౌర్యువ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. హీరోహీరోయిన్స మధ్య కెమిస్ట్రీ, నాని-బేబీ కియారా మధ్య వచ్చిన సన్నివేశాలు కంటతడి పెట్టించినట్లు అభిమానులు చెబుతున్నారు.

అయితే ఈ సినిమాపై ఇప్పటికే పలువురు నటీనటులు నెట్టింట స్పందించగా.. తాజాగా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ట్వీట్ చేశారు. ఈ చిత్రం కేవలం తండ్రులనే కాకుండా ప్రతి కుటుంబ సభ్యుల హృదయాలను హత్తుకుంటుందంటూ సుదీర్ఘమైన ట్వీట్ చేశారు. "హాయ్ నాన్న టీమ్ కు అభినందనలు. ఎంతో మధురమైన చిత్రం. నిజంగా హత్తుకునే చిత్రమిది. సోదరుడు నాని యాక్టింగ్ అదుర్స్. అటువంటి స్క్రిప్ట్ ను అందించనందుకు రైటర్ తప ధన్యావాదాలు. డియర్ మృణాల్.. నీ స్వీట్ నెస్ స్క్రీన్ పై కనిపిస్తోంది. మీలాగే అందంగా ఉంది.

బేబీ కియారా.. నీ క్యూట్ నెస్ తో హృదయాలను తాకేశావ్. ఇక స్కూల్ కు వెళ్లి (నవ్వుతూ) ఇతర ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్‌లు, కెమెరామెన్‌కు కూడా అభినందనలు. దర్శకుడు శౌర్యువ్ తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నారు. మీ ప్రజెంటేషన్ సూపర్. ఇలాంటి మధురమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన నిర్మాతలకు అభినందనలు. హాయ్ నాన్నచిత్రం తండ్రులనే కాకుండా ప్రతి కుటుంబ సభ్యుల హృదయాలను హత్తుకుంటుంది" అని బన్నీ ట్వీట్ చేశారు.

మరోవైపు, ఈ మూవీ ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి వస్తుందా అని సినిమా లవర్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఫిక్స్ అయినట్లు సమాచారం. హాయ్ నాన్న డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందట. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను రూ.37 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిప‌బ్లిక్ డే కానుక‌గా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ మూవీలో శ్రుతిహాస‌న్, ప్రియ‌ద‌ర్శి, అంగ‌ద్ బేది, జ‌య‌రామ్, విరాజ్ అశ్విన్ త‌దిత‌రులు కీల‌కపాత్రల్లో నటించారు. నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.40 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.