మగధీర తరువాత మళ్ళీ ఇలా... అల్లు అరవింద్ స్టన్నింగ్ కామెంట్స్
ముఖ్య అతిథిగా అల్లు అరవింద్ పాల్గొని సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 2 Dec 2024 5:46 PM GMTపుష్ప 2 సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా అల్లు అరవింద్ పాల్గొని సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ, "నేను వారం రోజుల క్రితం ఈ సినిమా చూశాను. ఇంటికి వచ్చిన తర్వాత మా ఆవిడ అడిగింది - ‘ఏంటి? మొహం ఇలా వెలిగిపోతుంది’ అని. నేను ‘ఇప్పుడే సినిమా చూసి వచ్చాను, చాలా బాగుంది’ అని చెప్పాను. ఆమె చెప్పిన మరో మాట నా మదిలో నిలిచిపోయింది - ‘మీ ముఖం ఇంత వెలిగిపోవడం మగధీర తర్వాత ఇప్పుడు చూస్తున్నాను’ అని," తను చెప్పింది.
అలాగే "స్నేహ, భబిత ఇద్దరికి అవార్డులు ఇచ్చేయాలి. ఎందుకంటే ఐదేళ్ళ పాటు ఈ పాజిటివ్ పిచ్చోళ్ళను అలానే భరించారు. ఇక వారు సినిమా కోసం ఐదేళ్ల పాటు ఎంతో కష్టపడ్డారు. గొప్ప ఏకగ్రత ఉండకపోతే ఇలాంటి సినిమా రాదేమో అనిపించింది. రష్మిక మందన్న ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. గీత గోవిందం ద్వారా ఆమె టాలెంట్‌ను మొదట గుర్తించాం. ఇప్పుడు ఈ సినిమాలో ఆమె మళ్లీ తన ప్రావీణ్యం నిరూపించుకుంది. శ్రీలీల తక్కువ టైమ్ లొనే అదరగొట్టింది," అని వివరించారు.
ఇక "దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అద్భుతం. అతని తండ్రి ఆశీర్వాదాలు అతనికి తోడుగా ఉన్నాయి. ఇన్ని ఏళ్లుగా అతను కంటిన్యూగా మంచి హిట్స్ అందుకుంటున్నాడు. సినిమాటోగ్రాఫర్ కుబా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. అతని క్వాలిటీ వర్క్‌కి నా థాంక్స్," అని అల్లు అరవింద్ అన్నారు. ఇక "మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్యానర్. నవీన్, రవిశంకర్, చెర్రీ - ఈ ముగ్గురు కలసి ఎంతో సమన్వయంతో పని చేస్తున్నారు. ఇంత అనుసంధానంతో ఎన్ని సినిమాలు ఎలా చేస్తున్నారు అనేది నాకే ఆశ్చర్యంగా ఉంది. వారు నిజంగా బెస్ట్," అని ఆయన కొనియాడారు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని, ఇది కచ్చితంగా పాన్ ఇండియా హిట్ అవుతుందని అల్లు అరవింద్ అన్నారు.