Begin typing your search above and press return to search.

మెగా ప్రొడ్యూసర్ ముద్ర పడింది అంటే..!

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా అల్లు అరవింద్ స్పీచ్ ఆడియన్స్ ని అలరించింది.

By:  Tupaki Desk   |   14 Aug 2024 5:30 AM GMT
మెగా ప్రొడ్యూసర్ ముద్ర పడింది అంటే..!
X

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఒక సినిమా బాగుంది అని ముద్ర వేశారంటే మాత్రం ఆ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఆయన జడ్జిమెంట్ అంత నమ్మకంగా ఉంటుంది. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో వస్తున్న ఆయ్ సినిమా గురించి కూడా నిర్మాత అల్లు అరవింద్ అలాంటి కామెంట్స్ చేశారు. నార్నే నితిన్, నయన్ సారిక లీడ్ రోల్ లో నటించిన ఆయ్ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా అల్లు అరవింద్ స్పీచ్ ఆడియన్స్ ని అలరించింది.

ముందుగా మైక్ అందుకున్న అల్లు అరవింద్ మీడియా మిత్రులందరూ సినిమాను కాస్త లోపలికి తీసుకెళ్లండని అన్నారు. ఈ సినిమా ఆగష్టు 15న సాయంత్రం 4 గంటలకు రిలీజ్ అవుతుంది. విషయం తెలుసో లేదో అని గుర్తు చేస్తున్నానని అన్నారు. ముందుగా నిఖిల్ గురించి చెబుతూ మా బ్యానర్ నుంచి వెళ్లినా నువ్వు హీరోవి ఈవెంట్ కి వచ్చినందుకు థాంక్స్ అని అన్నారు అల్లు అరవింద్. శ్రీ లీల గీతా ఆర్ట్స్ నుంచి కాల్ రాగానే సినిమా ఆఫర్ అనుకుందట. కచ్చితంగా ఆమెతో ఒక మంచి సినిమా చేస్తాం ఈవెంట్ కి వచ్చినందుకు సంతోషమని అన్నారు.

ఎన్టీఆర్ ఫ్యామిలీ హీరో ఆయన సినిమాల్లా ఫైట్లు ఉండవని చెప్పాం అయినా ఈ సినిమాకు ఒప్పుకున్నాడు. ఇక్కడ ఎవరు కష్టం వాడు పడాల్సిందే ఈ సినిమా కోసం నితిన్ బాగా కష్టపడ్డాడని అన్నారు. హీరోయిన్ కూడా చాలా బాగా చేసిందని అన్నారు అల్లు అరవింద్. చాలాకాలం తర్వాత వినోదో కుమార్ మంచి క్యారెక్టర్ చేశారు. సినిమా మొత్తం వాళ్లంతా చేస్తే చివర్లో వచ్చి ఈయన పట్టుకెళ్లిపోయారు. సినిమాలో నితిన్ తో పాటు చేసిన ఇద్దరు కుర్రాళ్లు చించి వదిలేశారని అన్నారు అల్లు అరవింద్.

తాను సినిమా చూశాను చాలా బాగుంది. లాస్ట్ లో హార్ట్ ఫుల్ గా అనిపించింది. సినిమా మొత్తం ఎంజాయ్ చేసి గుడ్ ఫీలింగ్ తో వస్తామని అన్నారు అల్లు అరవింద్. సినిమా కథ విని డైరెక్టర్ పై 10 కోట్లు ఖర్చు పెట్టించాడు. బన్నీ వాసుని ఏం చెప్పి డైరెక్టర్ అంజి ఒప్పించాడో కానీ నాది బాధ్యత అని ఈ సినిమా చేశాడు. ఆయ్ ఫ్రెండ్ షిప్ కథ కాబట్టే స్నేహితుడి కోసం కూడా బన్నీ నిలబడ్డాడని అన్నారు అల్లు అరవింద్.