Begin typing your search above and press return to search.

పుష్ప 2 జాతర.. అయాన్ డైలాగ్ - అర్హ పద్యం!

అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ అలాగే కుమార్తె అల్లు అర్హ వారి క్యూట్ లుక్స్ తో పాటు, మాటలతో వేడుకలో ప్రత్యేక చర్చకు కారణమయ్యారు.

By:  Tupaki Desk   |   2 Dec 2024 5:29 PM GMT
పుష్ప 2 జాతర.. అయాన్ డైలాగ్ - అర్హ పద్యం!
X

పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకకు ప్రముఖులు, అభిమానులు భారీగా హాజరయ్యారు. ముఖ్యంగా, అల్లు అర్జున్ కుటుంబం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ అలాగే కుమార్తె అల్లు అర్హ వారి క్యూట్ లుక్స్ తో పాటు, మాటలతో వేడుకలో ప్రత్యేక చర్చకు కారణమయ్యారు.

మొదటగా, అల్లు అయాన్ మైక్ అందుకుని మాట్లాడుతూ, "నమస్కారం, అందరూ ఎలా ఉన్నారు? మీకు అందరికీ పుష్ప చాలా బాగుంటాది ఇంకా తగ్గేదే లే," అని అందరినీ ఆకట్టుకున్నారు. అయాన్ మాటలు విన్న ప్రతీ ఒక్కరూ ఆయన్ను మెచ్చుకున్నారు. అల్లు అర్జున్ తరంలో వచ్చే కొత్త తరం కూడా స్టేజ్‌పై అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుందనే అభిప్రాయం అందరిలో వ్యక్తమైంది.

ఇక బన్నీ గారాల కూతురు అల్లు అర్హ మరింత ప్రత్యేకంగా ఆకర్షించారు. ఆమె స్టేజ్‌పైకి వెళ్లి అందరికీ నమస్కారం తెలిపి, తెలుగు పద్యం "అటజనిగాంచె..." అంటూ గుక్క తిప్పకుండా చెప్పడం ప్రేక్షకులందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె చిన్న వయస్సులోనే అంత సులభంగా పద్యాన్ని చెప్పడంతో చూసినవారంతా ఆమె ప్రతిభపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇది చూస్తున్న అల్లు అర్జున్ కూడా సంతోషంతో ఉప్పొంగిపోయారు.

ఈ కార్యక్రమంలో అల్లు వారసుల టాలెంట్ కు అల్లు ఫ్యాన్స్ అందరూ ఫిదా అయ్యారు. ఇక పుష్ప 2 వేడుకలో వీరి రాక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్న వయస్సులోనే ఇలా తనయులు అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించడాన్ని చూస్తూ, అల్లు కుటుంబం గర్వపడుతోందని అనిపించింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రేక్షకులలో మరింత ఆసక్తి, ఆనందం నింపిందని చెప్పవచ్చు.

ఇక పుష్ప 2 సినిమా డిసెంబర్ 5వ తేదీన గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతే కాకుండా ఒకరోజు ముందుగానే ప్రత్యేకంగా పలుచోట్ల ప్రీమియర్స్ కూడా ప్రదర్శించబోతున్నారు. ఈ ప్రత్యేకమైన షోల కోసం కూడా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా మొదటి రోజు ఊహించని స్థాయిలో బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటుంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నార్త్ ఇండస్ట్రీలో కూడా సినిమా ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది అని చెబుతున్నారు.