Begin typing your search above and press return to search.

అల్లు బాబి నుంచి బ్లాక్ బ‌స్ట‌ర్ ఏదైనా ఉందా?

అల్లు అర‌వింద్ వార‌సుడు బాబి తండ్రి వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకుని నిర్మాత‌గా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   2 Feb 2024 4:30 PM GMT
అల్లు బాబి నుంచి బ్లాక్ బ‌స్ట‌ర్ ఏదైనా ఉందా?
X

అల్లు అర‌వింద్ వార‌సుడు బాబి తండ్రి వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకుని నిర్మాత‌గా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన `గని` సినిమాతో బాబి నిర్మాత‌గా ప‌రిచ‌య‌మ‌య్యాడు. అప్ప‌టి వ‌ర‌కూ వేర్వేరు బిజినెస్ ల్లో ఉన్న బాబి తొలిసారి నిర్మాణంలోకి అడుగు పెట్టాడు. దీంతో బాబి తండ్రి వార‌స‌త్వాన్ని ఇండ‌స్ట్రీలో నిర్మాత‌గా కొన‌సాగిస్తాడ‌ని అర్ద‌మైంది. బ‌న్నీ..శిరీష్ లు న‌ట‌న‌వైపు ఉండ‌టంతో నిర్మాణంపై వాళ్లిద్ద‌రు దృష్టి పెట్ట‌లేక‌పోయారు.

వ్యాపార రంగంలో బాబికి ఎలాగూ అనుభ‌వం ఉన్న నేప‌థ్యంలో ఇటువైపు వ‌స్తే బాగుంటుంద‌ని భావించి ఎంట్రీ ఇచ్చాడు. కానీ తొలి సినిమానే బాబికి గ‌ట్టి షాక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన ఆ సినిమా దారుణ‌మైన ఫ‌లితాలు చూసింది. ఆ సినిమాకి ఖ‌ర్చు కూడా భారీగానే చేసారు. బాబి ప‌రిచ‌య‌వుతోన్న సినిమా కావ‌డంతో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా పెట్టుబ‌డి పెట్టారు. కానీ తాను ఒక‌టి అనుకుంటే మ‌రో స‌న్నివేశం ఎదురైంది.

ఆ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ ఇంత‌వ‌ర‌కూ నిర్మాత‌గా బాబి రెండ‌వ సినిమా ప్ర‌క‌టించ‌లేదు. చాలా కాలంగా మీడియాలోనూ క‌నిపించ‌లేదు. సోష‌ల్ మీడియాలో అప్పుడ‌ప్పుడు క‌నిపించే వాడు. ఇప్పుడు ఆ వేదిక‌పైనా యాక్టివ్ గా లేడు. దీంతో బాబి ఏం చేస్తున్నాడు? అన్న సందేహం మొద‌లైంది. ఇంత గ్యాప్ రావ‌డంతో బాబి నిర్మాణానికి దూర‌మ‌వుతున్నాడా? అన్న సందేహాలు సైతం తెర‌పైకి వ‌స్తున్నాయి. మ‌రి వీటికి బాబి పుల్ స్టాప్ పెడ‌తాడా? లేదా? అన్న‌ది చూడాలి.

ప్ర‌స్తుతం గీతా ఆర్స్ట్ అల్లు అర‌వింద్ చేతుల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ సంస్థ‌ని ఆయ‌నే చాలా కాలంగా చూసుకుంటూ వ‌స్తున్నారు. అదే సంస్థ‌కి అనుబంధంగా జీఏ- బ్యాన‌ర్ కూడా స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు. ఆ వ్య‌వ‌హ‌రాలు బ‌న్నీ వాసు చూస్తున్నాడు. కానీ అరవింద్ త‌దానంత‌రం భ‌విష్య‌త్ లో ఆ రెండు సంస్థ‌ల బాధ్య‌త‌లు చూసుకోవాల్సింది వార‌సులే. న‌టుడిగా బ‌న్నీ బిజీ..అల్లు శిరీష్ నిల‌దొక్కుకునే ప‌నుల్లో బిజీ. ఈ నేప‌థ్యంలో వ్యాపార రంగంలో అనుభ‌వం ఉన్న బాబినే ముందు క‌నిపిస్తున్నాడు.