అల్లు వారి కోడలు.. హై గ్లామర్ ట్రీట్
కేవలం వెండి తెరపై మాత్రమే కాకుండా బాహ్య ప్రపంచంలో కూడా తన స్టైలింగుతో అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు.
By: Tupaki Desk | 24 Nov 2023 11:06 AM GMTఅల్లు అర్జున్ తన ప్రతి సినిమాతో కూడా స్టార్ ఇమేజ్ ను పెంచుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఇక అతని స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం వెండి తెరపై మాత్రమే కాకుండా బాహ్య ప్రపంచంలో కూడా తన స్టైలింగుతో అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇక ఈ అల్లు హీరో సతీమణి కూడా ఇప్పుడు అదే తరహాలో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
ఇటీవల కాలంలో అల్లు వారి కోడలు స్పెషల్ ఫోటోషూట్స్ తో కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్టులో చేరిపోతోంది. అంతే కాకుండా ప్రతి ఫ్రేమ్ లో కూడా గ్లామరస్ హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసుకొని విధంగా ఆమె హైలైట్ అవుతూ వస్తోంది. రీసెంట్గా మరోసారి అల్లు స్నేహారెడ్డి రెడ్ రెడ్ కలర్ డ్రెస్ లో ఆమె కనిపించిన విధానం చాలా అందంగా ఉంది అంటూ ఫ్యాన్ ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతూ ఉన్నారు.
ఒకవైపు ట్రెడిషనల్ మరొకవైపు అల్ట్రా గ్లామరస్ అనే విధంగా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ఉంది అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. ఇక ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆమె చాలా అందంగా ఉంది అంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఆమె కు ఒక్కసారి అయినా అల్లు అర్జున్ తో నటించే అవకాశం కల్పించాలి అని, ఒక చిన్న కమర్షియల్ యాడ్ వచ్చిన కూడా హై రెస్పాన్స్ వస్తుంది అని కూడా సలహాలు ఇస్తున్నారు.
మరి నిజంగానే అల్లు స్నేహారెడ్డి తన భర్త అల్లు అర్జున్ తో కలిసి ఒకే ఫ్రేమ్ లో ప్రేమగా కనిపిస్తుందో లేదో చూడాలి. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్లో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హై బడ్జెట్ మూవీ పై అంచనాలు మామూలుగా లేవు.
నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత సుకుమార్ ఈ ప్రాజెక్టుపై మరింత ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ అయితే పూర్తయింది. మిగిలిన షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసే అనుకున్న సమయానికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు.