Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ - త్రివిక్రమ్.. బడ్జెట్ అయితే గట్టిగానే..

‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాపై ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ నెక్స్ట్ సినిమా ఉండబోతోంది.

By:  Tupaki Desk   |   31 Oct 2024 4:26 AM GMT
అల్లు అర్జున్ - త్రివిక్రమ్.. బడ్జెట్ అయితే గట్టిగానే..
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప 2’ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అల్లు అర్జున్ కెరీర్ లోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన చిత్రంగా ఈ మూవీ ఉంది. అలాగే ఇండియాలోనే అత్యధిక థీయాట్రికల్, నాన్ థీయాట్రికల్ వ్యాపారం జరిగిన మూవీగా కూడా రికార్డు సృష్టించింది. ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాపై ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ నెక్స్ట్ సినిమా ఉండబోతోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. నిర్మాత నాగ వంశీ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. కచ్చితంగా ఈ సినిమా ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉండబోతుందని చెప్పారు. సరికొత్త ప్రపంచాన్ని ఈ మూవీ కోసం త్రివిక్రమ్ క్రియేట్ చేశారని అన్నారు. ‘పుష్ప 2’ రిలీజ్ తర్వాత బన్నీ ఎప్పుడంటే అప్పుడు సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కథాంశం మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మైథాలజీ మీద మంచి పట్టు ఉంది. అందులోని కథలని రిఫరెన్స్ గా తీసుకొని త్రివిక్రమ్ మూవీస్ చేస్తూ ఉంటారు. అతని డైలాగ్స్ లో కూడా ఎక్కువగా మైథాలజీ అడాప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కోసం అదిరిపోయే కథను సిద్ధం చేశారని అనుకుంటున్నారు. బన్నీ ఫ్యాన్స్ కూడా ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలోనే ఈ చిత్రం ఉండబోతోంది.

ఏకంగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. మైథిలాజికల్ ఎలిమెంట్స్ తో పాటు, భారీ క్యాస్టింగ్ కోసం ఈ బడ్జెట్ ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ పార్ట్ సినిమాలో ఎక్కువగా ఉండబోతుందని సమాచారం. బన్నీ కెరీర్ లో ఇప్పటివరకు టచ్ చేయని క్యారెక్టరైజేషన్ ఈ సినిమా కోసం త్రివిక్రమ్ డిజైన్ చేశారంట. అలాగే ఒక స్టార్ హీరోయిన్ ని ఈ మూవీలో లీడ్ రోల్ కోసం ఎంపిక చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

జనవరిలో ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో అనుకుంటున్నారు. ‘పుష్ప 2’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి 1,000 కోట్లకి పైగా కలెక్ట్ చేస్తే కచ్చితంగా అల్లు అర్జున్ మార్కెట్ స్టామినా పెరిగినట్లే అవుతుంది. ఈ క్రేజ్ త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. డార్లింగ్ ప్రభాస్ తర్వాత ఇప్పుడు దేశంలోనే అత్యధిక మంది ఆదరిస్తున్న నటుడిగా అల్లు అర్జున్ ఉన్నారు. అందువలన ఆయన నుంచి రాబోయే సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.