అల్లు శిరీష్ కి డాడీ మాటలు గుర్తు చేసిన సినిమా!
ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన `12th ఫెయిల్` ఇటీవల విడుదలై ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే
By: Tupaki Desk | 11 Feb 2024 6:02 AM GMTఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన `12th ఫెయిల్` ఇటీవల విడుదలై ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. మనోజ్ కుమార్ పాత్రలో విక్రాంత్ మాస్సే నటన..విదు వినోద్ చోప్రా మేకింగ్ తో ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. బాలీవుడ్ లో ఓ మరో గొప్ప బయోపిక్ గా నిలిచింది. భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకున్న సినిమా.
ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమాకి ఏకంగా 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులు కూడా కైవసం చేసుకుంది. ఈ అవార్డులు రావడంతో సినిమా రీచ్ మరింత పెరిగింది. ప్రేక్షకాభిమానులు ఓటీటీలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి అల్లు శిరష్ కూడా స్పందించాడు. సినిమా తనకెంతో నచ్చిందన్నాడు. అందరి కంటే సినిమాను ఆలస్యంగా చూసానని... కానీ చివరి వరకూ చూస్తున్నంత సేపు కళ్లు చెమర్చాయన్నాడు.
విక్రాంత్ మాస్సే.. మేధా శంకర్ నటన..దర్శకుడి మేకింగ్ సినిమాని నెక్స్ట్ లెవల్ తీసుకెళ్లాయన్నాడు. `దర్శకుడు ఇలాంటి కథను ఎంచుకోవడం గొప్ప విషయం. సినిమా చూస్తున్నంత సేపు నా కాలేజీ రోజులు కొన్ని గుర్తుకొచ్చాయి. నేను జర్నలిజం చదువుతోన్న సమయంలో మానాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చా యి. మనల్ని రాజకీయ నాయకులు పాలిస్తూ ఉండొచ్చు..కానీ దేశం..వ్యవస్థ అంతా బ్యూరో క్రేట్స వల్ల మాత్రమే రన్ అవుతుందని చెప్పారు.
అవే మాటలు ఈ సినిమా చూస్తున్నంతసేపు నా మదిలో మెదిలాయి. చూడాలనుకున్న వారికి గొప్ప అనుభూతిని ఈ సినిమా అందిస్తున్నారు. చూడని వారంతా హాట్ స్టార్ లో చూడొచ్చు అని రికమండ్ చేసాడు. 2019లో 12th ఫెయిల్ అయిన మనోజ్ కుమార్ శర్మ ఎన్నో కష్టాలుపడి ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అయ్యారు? అని అనురాగ్ పాఠక్ రాసిన పుస్తకాన్ని ఆధారం చేసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు.