Begin typing your search above and press return to search.

అల్లు శిరీష్ బడ్డీ.. ఇది బాక్సాఫీస్ పరిస్థితి!

అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షశివో మూవీతో రెండేళ్ల క్రితం రిలీజ్ అయ్యింది.

By:  Tupaki Desk   |   6 Aug 2024 5:20 AM GMT
అల్లు శిరీష్ బడ్డీ.. ఇది బాక్సాఫీస్ పరిస్థితి!
X

అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షశివో మూవీతో రెండేళ్ల క్రితం రిలీజ్ అయ్యింది. ఆ సినిమా పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ గా అయితే బిగ్గెస్ట్ హిట్ కాలేదు. మరల లాంగ్ గ్యాప్ తీసుకొని బడ్డీ అనే మూవీతో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుంచే డివైడ్ టాక్ వచ్చింది. స్టూడియో గ్రీన్ లాంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన సినిమా అయిన కూడా ప్రేక్షకులకి చేరలేకపోయింది.

సినిమా ప్రమోషన్స్ అయితే గట్టిగానే చేశారు. కానీ ఎందుకనో మూవీపై పబ్లిక్ అటెన్షన్ పెద్దగా పడలేదు. అందుకే ఆగష్టు 2న రిలీజ్ అయిన ఈ సినిమాకి పెద్దగా ఓపెనింగ్స్ ని కూడా రాలేదు. తమిళంలో ఆర్య హీరోగా వచ్చిన టెడ్డి మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ టెడ్డి క్యారెక్టర్ ని కొనసాగిస్తూ మరో కథతో బడ్డీ మూవీ చేశారు. అయితే రొటీన్ కథని చెప్పడంతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు. ఆ ప్రభావం స్పష్టంగా మూవీ కలెక్షన్స్ లో కనిపిస్తోంది.

ఈ సినిమా మొదటి, రెండు రోజులు వరల్డ్ వైడ్ గా 60 లక్షల షేర్ ని అందుకోగా తెలుగు రాష్ట్రాల్లోనే 50 లక్షలు వచ్చింది. మూడో రోజు ఆదివారం కూడా కలెక్షన్స్ పరంగా బడ్డీ మూవీ ఎలాంటి ప్రభావం చూపించలేదు. 20 లక్షల షేర్ ని తెలుగులో రాష్ట్రాలలో వసూళ్లు చేసింది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 25 లక్షల వరకు ఉంది. చాలా చోట్ల షేర్ నెగిటివ్ లో కూడా ఉందంట. ఆ లెక్కన చూసుకుంటే టోటల్ షేర్ ఇంకా తగ్గిపోయే ఛాన్స్ ఉంది.

నెగిటివ్ షేర్ లెక్కించకుండా చూసుకుంటే వీకెండ్ మూడు రోజుల్లో 75 లక్షల వరకు బడ్డీ మూవీ కలెక్ట్ చేసింది. 4.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చింది. వీకెండ్ లోనే పెద్దగా వసూళ్లు రాలేదంటే మిగిలిన రోజులు డైలీ 10 లక్షల షేర్ కూడా అందుకోకపోవచ్చనే మాట వినిపిస్తోంది. ఏ విధంగా చూసుకున్న బడ్డీ మూవీ భారీ నష్టాలని అయితే మిగల్చనుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

అల్లు శిరీష్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లలో బడ్డీ ఒకటిగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఇలాంటి యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథలు కాకుండా లవ్ స్టోరీస్ లాంటివి చేసుకుంటే అల్లు శిరీష్ కి ఆదరణ పెరగొచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి శిరీష్ భవిష్యత్తు ఇంకా ఎలాంటి కథలను సెలెక్ట్ చేసుకుంటాడో చూడాలి.