అల్లు 'బడ్డీ' టైమ్... మంచి నిర్ణయం!
ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్, టీజర్స్ ఇతర ప్రమోషనల్ స్టఫ్ ఆకట్టుకోవడంతో సినిమా పై అంచనాలు, ఆసక్తి పెరిగాయి.
By: Tupaki Desk | 29 July 2024 5:33 AM GMTఅల్లు శిరీష్ హీరోగా శాన్ ఆంటోన్ దర్శకత్వంలో రూపొందిన బడ్డీ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. మొదట ఈ సినిమా ఒక తమిళ సినిమాకు రీమేక్ అనే ప్రచారం జరిగింది. కానీ ఆ సినిమాకు ఈ సినిమాకు ఏ మాత్రం సంబంధం లేదని, పూర్తి కొత్త కథతో దర్శకుడు శాన్ ఆంటోన్ రూపొందించారని మేకర్స్ పలు సందర్భాల్లో ప్రకటించారు.
ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్, టీజర్స్ ఇతర ప్రమోషనల్ స్టఫ్ ఆకట్టుకోవడంతో సినిమా పై అంచనాలు, ఆసక్తి పెరిగాయి. ఈ సినిమా కోసం చూస్తున్న ప్రేక్షకుల ఎదురుచూపులకు తెర పడబోతుంది. ఈ వారంలోనే అంటే ఆగస్టు 2న ఈ సినిమా విడుదల అవ్వబోతుంది.
గాయత్రి భరద్వాజ్ మరియు ప్రిషా సింగ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు మేకర్స్ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో రూ99 లకు, మల్టీప్లెక్స్ లలో రూ.125 లకు చూడవచ్చు అంటూ మేకర్స్ ప్రకటించారు.
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభిస్తుంది. ఇలాంటి సినిమాలను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు టికెట్స్ రేట్లను తగ్గించడం అనేది చాలా మంచి నిర్ణయం అంటూ విశ్లేషకులతో పాటు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా కంటెంట్ పై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ఇంతటి సాహస నిర్ణయాన్ని తీసుకోలేరు. కనుక చిత్ర యూనిట్ సభ్యులకు తమ సినిమా పై చాలా నమ్మకం ఉన్నట్లు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండి, నమ్మకం ఉంటే ఇలాంటి రిస్క్ లు చేయడం లో తప్పు లేదు.
చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు. సినిమా పై వారికి ఉన్న నమ్మకం నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. సినిమా కి ప్రీ రిలీజ్ బజ్ క్రియేట్ అయ్యింది కనుక పాజిటివ్ టాక్ వస్తే మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. టికెట్ల రేట్ల తగ్గింపు వల్ల మరింతగా ప్రయోజనం ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి.