Begin typing your search above and press return to search.

బడ్డీ: ఆ టెడ్డిబేర్ క్యారెక్టర్ ఎవరిదంటే

ఈ చిత్రంలో టెడ్డి బేర్ చేసే స్టంట్స్, ఫన్ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   31 July 2024 11:49 AM GMT
బడ్డీ: ఆ టెడ్డిబేర్ క్యారెక్టర్ ఎవరిదంటే
X

మెగా హీరో అల్లు శిరీష్ 2022లో ఊర్వశివో రాక్షశివో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి పర్వాలేదనే టాక్ సొంతం చేసుకున్నారు. మరల రెండేళ్ల గ్యాప్ తీసుకొని శిరీష్ బడ్డీ సినిమాతో ఆగష్టు 2న ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. సామ్ అంటోన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో టెడ్డి బేర్ చేసే స్టంట్స్, ఫన్ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.

గాయిత్రి భరద్వాజ్, ప్రిష సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటించారు. అల్లు శిరీష్ ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లలో నటించినట్లు ట్రైలర్ బట్టి తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఏ సినిమాలో బడ్డీ క్యారెక్టర్ లో నటించిన టెడ్డి బేర్ క్యారెక్టర్ ని చిత్ర యూనిట్ రివీల్ చేసింది. తమిళంలో ఆర్య హీరోగా తెరకెక్కిన తెరకెక్కిన టెడ్డి మూవీలోని టెడ్డి గోకుల్ క్యారెక్టర్ ని బడ్డీలో కూడా కొనసాగింపుగా ఉండబోతోందని తెలియజేశారు.

కచ్చితంగా ఈ సినిమాలో బడ్డీగా టెడ్డి బేర్ చేసే విన్యాసాలు ప్రతి ఒక్కరిని అలరిస్తాయని తెలిపారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ ఈ సినిమా టికెట్ ధరలు అందరికి అందుబాటులో ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. టికెట్ ధరలు పెంచడం వలన ప్రేక్షకులకి సినిమా దూరం అయిపోతుందనేది తన అభిప్రాయం అని చెప్పుకొచ్చారు. బడ్డీ సినిమాకి మాత్రం టికెట్ రేట్లు రీజనబుల్ ధరల్లోని ఉన్నట్లు స్పష్టం చేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో 90, మల్టీప్లెక్స్ లలో 125 ధరలలో బడ్డీ మూవీ టికెట్ లు అందుబాటులో ఉంటాయని అన్నారు.

ఈ టెడ్డి సినిమాటిక్ వరల్డ్ లో భాగంగానే ఈ సినిమా వస్తున్నట్లు ట్రైలర్ తో స్పష్టం అయ్యింది. అజ్మల్ అమీర్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతో, హై విజువల్ స్టాండర్డ్స్ లో స్టూడియో గ్రీన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించింది. మరి ఈ సినిమా అల్లు శిరీష్ కి ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది వేచి చూడాలి.