అల్లు శిరీష్‌పై ఈ ప్రచారం నిజమేనా?
అల్లు అర్జున్ టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్నారు. అయితే అన్న బాటలో నటుడయ్యాడు అల్లు శిరీష్
By: Tupaki Desk | 8 Feb 2024 5:30 AM GMTఅల్లు అర్జున్ టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్నారు. అయితే అన్న బాటలో నటుడయ్యాడు అల్లు శిరీష్. తనని తాను నిరూపించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ఆశించిన విజయాలు దక్కలేదన్నది వాస్తవం. నటుడిగా శిరీష్ పరిణతి చెందినా కానీ, ఇప్పటికీ సరైన బ్లాక్ బస్టర్ కోసం వేచి చూస్తున్నాడు. ఇక ఎంపిక చేసుకునే ప్రాజెక్టుల విషయంలోను ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.
అయితే శిరీష్ ఎంపికల విషయంలో అల్లు అరవింద్- అల్లు అర్జున్ ఒత్తిడి ఏ మేరకు ఉంటుంది? వారి ప్రమేయం లేకుండా శిరీష్ స్వయంగా స్క్రిప్టులను ఎంపిక చేయడం వల్లనే ఫెయిలయ్యాడని, ఈ విషయంలో ఇతరులతో శిరీష్ విభేధిస్తాడని ప్రచారం ఉంది. అలాగే శిరీష్ కి తన కుటుంబంతో ఇష్యూస్ ఉన్నాయన్న ప్రచారం కూడా సాగించింది ఒక సెక్షన్ మీడియా. అయితే ఇదంతా నిజమేనా? అంటే.. శిరీష్ తో సినిమాలు తీసిన నిర్మాత ధీరజ్ మొగిలినేని ఇచ్చిన వివరణ ఇలా ఉంది.
నిజానికి అవన్నీ లైక్ లు క్లిక్ ల కోసం కొన్ని యూట్యూబ్ మీడియాలు సాగిస్తున్న ప్రచారం మాత్రమే. అందులో ఎలాంటి నిజం లేదని ధీరజ్ మొగిలినేని కొట్టి పారేసారు. ''అల్లు హీరోలు ఒకటే ఫ్యామిలీ .. ఒకే ఇంట్లో అందరూ కలిసే ఉంటారు. కలిసే భోజనం చేస్తారు.. కలిసే షికార్లు వెళారు.. వేరుగా ఉండరు అని తెలిపారు. కానీ యూట్యూబ్ లో లైక్ ల కోసం ఇలా ప్రచారం చేస్తున్నార''ని అన్నారు. కెరీర్ పరంగా శిరీష్ ని ఎవరూ ప్రభావితం చేయలేరు. అల్లు అరవింద్ ఇన్ పుట్స్ ఇస్తారు కానీ ప్రభావితం చేయరు. కెరీర్ స్ట్రగుల్ లో తనదే బాధ్యత. శిరీష్ కి ఎవరైనా కథ బావుంది ఓకే చేయ్ అని చెబుతారు అంతే.. శిరీష్ తన కథ- స్క్రిప్టును తానే ఎంపిక చేసుకుంటారు.. అని తెలిపారు.
ప్రస్తుతం శిరీష్ రెండు సినిమాల్లో నటిస్తున్నారు. 'టెడ్డీ' అనే సినిమా షూటింగ్ పూర్తి చేసిన అల్లు శిరీష్.. జ్ఞనావేల్ రాజాతో ఒక సినిమా చేస్తున్నారని తెలిపారు.