Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ పాలిటిక్స్.. ఈ హీరో ఏమన్నారంటే..

కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా యువ హీరోలు నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలుపొందాలని చాలా బలంగా కోరుకుంటు ఉన్నారు.

By:  Tupaki Desk   |   11 May 2024 6:13 AM GMT
పవన్ కళ్యాణ్ పాలిటిక్స్.. ఈ హీరో ఏమన్నారంటే..
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో కానీ ముందుగానే ఆయనకు పొందుతున్న మద్దతు చూస్తూ ఉంటే భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అనేలా కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. గతంలో కంటే ఈసారి పవన్ కళ్యాణ్ కు సినిమా ఇండస్ట్రీలో నుంచి ఎక్కువ స్థాయిలో సపోర్ట్ లభిస్తూ ఉండడం విశేషం.

కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా యువ హీరోలు నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలుపొందాలని చాలా బలంగా కోరుకుంటు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఒక వీడియో కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక అదే బాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా తన బాబాయ్ కు మద్దతును అందించారు. ఇక అల్లు అర్జున్ కూడా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ విజయం సాధించాలి అని కోరుకున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ అలాగే నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఏకంగా ప్రచారాలలో కూడా పాల్గొన్నారు. ఆయన రాజకీయాల్లోకి రాకముందే ఎంతో మందికి సహాయం చేశారు. వెండితెరపై ఎంతో మంచి క్యారెక్టర్స్ చేసిన పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో కూడా అంతే మంచి స్వభావంతో కనిపించాడు అంటూ ఆయనకు మద్దతును అందిస్తున్నారు.

నేచురల్ స్టార్ నాని రాజ్ తరుణ్ లాంటి యువ హీరోలు కూడా వారి సపోర్ట్ అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అల్లో ఫ్యామిలీ నుంచి మరో యువ హీరో కూడా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ అందించడం హాట్ టాపిక్ గా మారింది. అల్లు శిరీష్ సోషల్ మీడియా ద్వారా తన విషెస్ ను పవన్ కళ్యాణ్ అందిస్తున్నట్లుగా వివరణ ఇచ్చారు.

సినిమాల్లో లేదా వ్యక్తిగత జీవితంలో పొందుపరిచిన సామాజిక సందేశం ద్వారా పవన్ కళ్యాణ్ గారు సమాజానికి సేవ చేయడానికి ఎల్లప్పుడూ కృషి చేశారు. కుటుంబ సభ్యుడిగా, అభిమానిగా ఆయన రాజకీయ ప్రయత్నానికి శుభాకాంక్షలు. అంటూ అల్లు శిరీష్ తెలియజేశారు. గతంలో చాలాసార్లు ఈ హీరో పవన్ కళ్యాణ్ గురించి చాలా పాజిటివ్ గా వివరణ ఇచ్చారు.

ఆయనను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అని నలుగురికి సహాయం చేసే గుణం కలిగిన నాయకుడు జనాలకు తప్పకుండా మంచి చేస్తాడు అని తెలియజేశాడు. ఇక పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా సక్సెస్ కావాలి అని అల్లు శిరీష్ కోరుకున్నారు. మరి ఇంత మంది హీరోల మద్దతు అందుకుంటున్న పవన్ కళ్యాణ్ ఈసారి ఏ స్థాయిలో ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.