Begin typing your search above and press return to search.

ఎప్పటికి వారి మధ్య బాండింగ్ డిస్టర్బ్ కాదు !

షూటింగ్ ఆలస్యం అవుతూ ఉండటంతో బన్నీ అసహనం వ్యక్తం చేసి గెడ్డం తీసేశారని కొత్త ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

By:  Tupaki Desk   |   22 July 2024 4:29 AM GMT
ఎప్పటికి వారి మధ్య బాండింగ్ డిస్టర్బ్ కాదు !
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రెడీ అవుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ది రూల్ షూటింగ్ దశలో ఉంది. అయితే మూడేళ్ళ నుంచి ఈ మూవీ షూటింగ్ కొనసాగుతూ ఉండటంతో ఫ్యాన్స్ లో కొంత అసంతృప్తి ఉంది. దానికి తోడు గత కొద్ది రోజులుగా పుష్ప ది రూల్ మూవీ మీద సోషల్ మీడియాలో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. అలాగే సుకుమార్, బన్నీ మధ్య విభేదాలు వచ్చాయని కొత్త గాసిప్స్ క్రియేట్ చేశారు. షూటింగ్ ఆలస్యం అవుతూ ఉండటంతో బన్నీ అసహనం వ్యక్తం చేసి గెడ్డం తీసేశారని కొత్త ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

అయితే సోషల్ మీడియాలో జరుగుతోన్న ఏ ప్రచారంలో వాస్తవం లేదని కొద్ది రోజుల క్రితం బన్నీ వాస్ క్లారిటీ ఇచ్చారు. సుకుమార్, బన్నీ మధ్య విభేదాలు రావడం అనేది అసాధ్యం అని అన్నారు. బన్నీ ఇంకా 15 రోజులు మాత్రమే షూటింగ్ చేయాల్సి ఉందని తెలిపారు. ఫాహద్ ఫాజిల్ షూటింగ్ కంప్లీట్ అయ్యాక బన్నీ సీన్స్ ని సుకుమార్ తెరకెక్కించనున్నారు. అందుకే గెడ్డం ట్రిమ్ చేసుకున్నారని బన్నీ వాస్ క్లారిటీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే తాజాగా బడ్డీ ప్రీమియర్ షోని హైదరాబాద్ లో వేశారు. ప్రీమియర్ షో అనంతరం అల్లు శిరీష్ మాట్లాడారు. పుష్ప ది రూల్ మూవీ ఎప్పుడు థియేటర్స్ లోకి వచ్చిన మీరు పెట్టుకున్న ఎక్స్ పెక్టేషన్స్ ని కచ్చితంగా రీచ్ అవుతుందని చెప్పారు. ఇది నేను అల్లు అర్జున్ తమ్ముడిగా చెప్పడం లేదని అన్నారు. సుకుమార్ అద్భుతంగా పుష్ప2ని రెడీ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ లో సినిమా గురించి మాట్లాడుకుంటే మా మేనేజర్ విని నాతో చెప్పిన మాటని నేను మీతో చెబుతున్నాను అని అల్లు శిరీష్ చెప్పుకొచ్చారు.

సుకుమార్, అల్లు అర్జున్ మధ్య విభేదాలు వచ్చాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కూడా అల్లు అర్జున్ తేల్చేశారు. ఎప్పటికి వారి మధ్య బాండింగ్ డిస్టర్బ్ కాదని అన్నారు. అల్లు శిరీష్ మాటలతో ఇన్ని రోజులు బన్నీ ఫ్యాన్స్ కి ఉన్న డౌట్స్ క్లియర్ అయిపోయాయి. సినిమా మీద హోప్స్ తో ఉన్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యామిలీ వెకేషన్ కోసం వెళ్లారు. నెల రోజులు ఫారిన్ లో ఉండి తిరిగొస్తారు. ఆ తరువాత సెప్టెంబర్ లో మూవీ రెగ్యులర్ షూటింగ్ మళ్ళీ స్టార్ట్ కావొచ్చని తెలుస్తోంది. ఫాహద్ ఫాజిల్ సన్నివేశాలు కూడా కొన్ని షూట్ చేయాల్సి ఉందంట. గతంలో అతని కాల్షీట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో కొంత గ్యాప్ వచ్చింది. ఇక ఇప్పుడు సెట్టవడంతో ఫైనల్ గా అతనితో షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.