అల్లు ఆర్మీ ఈసారైనా అతన్ని గట్టేక్కిస్తారా ..?
ఐతే రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కన్నా తెలుగు ఆడియన్స్ కు కొత్త కథలు చెప్పాలనే ప్రయత్నంలో అల్లు శిరీష్ ప్రయత్నాలు ఉన్నాయని చెప్పొచ్చు.
By: Tupaki Desk | 26 Jun 2024 6:27 AM GMTస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇప్పటికీ స్టార్ క్రేజ్ తెచ్చుకోవడంలో వెనకపడ్డాడు అల్లు ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్. నాన్న మెగా ప్రొడ్యూసర్.. అన్న ఒక పాన్ ఇండియా స్టార్. ఇంట్లో ఆ ఇద్దరిని పెట్టుకుని అల్లు శిరీష్ సూపర్ హిట్ కథలను ఎంచుకోకపోవడం కాస్త ఆశ్చర్యకరంగానే ఉంది. ఐతే రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కన్నా తెలుగు ఆడియన్స్ కు కొత్త కథలు చెప్పాలనే ప్రయత్నంలో అల్లు శిరీష్ ప్రయత్నాలు ఉన్నాయని చెప్పొచ్చు. కానీ అవి అంతగా కమర్షియల్ సక్సెస్ అందుకోవట్లేదు.
అంతేకాదు సినిమాల విషయంలో అల్లు శిరీష్ దూకుడు చూపించకపోవడం కూడా అతని కెరీర్ ని వెనక్కి నెట్టేస్తుందని అంటున్నారు. 2022 లో ఊర్వశివో రాక్షసివో సినిమాతో వచ్చిన అల్లు శిరీష్ లేటెస్ట్ గా బడ్డీ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు అల్లు శిరీష్. సాం ఆంటోని డైరెక్షన్ లో తెరేక్కిన బడ్డీ సినిమా స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.యి జ్ఞానవెల్ రాజా నిర్మించారు. ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అందించారు.
ఓ పక్క అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా సూపర్ స్టార్ డం తెచ్చుకోగా అతని తమ్ముడిగా అల్లు శిరీష్ కెరీర్ లో చాలా వెనుకబడి ఉన్నాడు. తనకున్న ఫ్యాన్స్ తనకొక ఆర్మీ అని చెప్పుకుంటున్న అల్లు అర్జున్ అదే ఆర్మీ సపోర్ట్ తమ్ముడికి అందించమని చెప్పడంలో విఫలమవుతున్నారు. అల్లు ఆర్మీ తమ్ముడిని కూడా ఎంకరేజ్ చేయాలని అల్లు అర్జున్ అనుకుంటున్నా అల్లు ఆర్మీ మాత్రం అతన్ని పట్టించుకోవట్లేదు. అందుకే బడ్డీ చివర్లో విలన్ అల్లు శిరీష్ ని ఎన్నిసార్లు వస్తావ్ రా అంటే గెలిచే వరకు అంటాడు.
సో అల్లు శిరీష్ ఆర్మీ సపోర్ట్ ఉన్నా లేకపోయినా తనకు తానుగా బాక్సాఫీస్ దగ్గర గెలిచే వరకు ఇలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడని అర్థమవుతుంది. జూలై 26న రిలీజ్ చేస్తున్న ఈ బడ్డీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ వస్తే సినిమాపై అల్లు ఆర్మీ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. బడ్డీ ట్రైలర్ ఐతే ఆడియన్స్ ని మెప్పించగా సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటే మాత్రం అల్లు హీరోకి సక్సెస్ దొరికినట్టే లెక్క. అల్లు శిరీష్ కూడా బడ్డీ మూవీ మీద చాలా నమ్మకంతో ఉన్నాడు.